- అదుపులో 10 మంది
కూకట్పల్లి, వెలుగు : కేపీహెచ్‌బీకాలనీలోని ఒక పేకాట స్థావరంపై దాడి చేసిన ఎస్ఓటీ అధికారులు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక ఆర్టీఏ ఆఫీసర్ ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి కేపీహెచ్‌బీకాలనీ కమ్యూనిటీ హాల్ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో స్పెషల్ఆపరేషన్టీమ్మెరుపు దాడి చేసింది.
ఇందులో బండ్లగూడ ఆర్టీఏ ఆఫీసర్షేక్ రాజ్‌మహ్మద్(58)తో పాటు మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పోలీసులు రూ. 86 వేల నగదు, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సొమ్మును కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు.
