- గ్రామ కంఠం భూమిని అప్పటి సర్పంచ్ ఆక్రమించుకున్నడు
- బీసీ,ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మెన్ విశారదన్ మహరాజ్
ఇబ్రహీంపట్నం, వెలుగు : దండు మైలారంలోని గ్రామకంఠం భూమిని పేదలకు పంచాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్విశారదన్ మహరాజ్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామస్తులతో కలిసి సోమవారం ధర్నాచేశారు.
ఈ సందర్భంగా విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ దండుమైలారంలోని సుమారు 4 ఎకరాల 20 గుంటల గ్రామ కంఠం భూమిని 30 ఏండ్ల క్రితం అప్పటి సర్పంచ్ కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడని ఆరోపించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకొని గ్రామ పంచాయతీకి అప్పగించాలని, ఆ భూమిని నిరుపేదల ఇండ్ల కోసం కేటాయించాలన్నారు. తర్వాత కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు.
