డిసెంబర్16న ఐపీఎల్ వేలం

డిసెంబర్16న ఐపీఎల్ వేలం

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌–2027 మినీ వేలం డిసెంబర్‌‌‌‌ 16న గోవాలో జరగనుంది. అలాగే ఫ్రాంచైజీలు తాము రిటేన్‌‌‌‌ చేసుకున్న ప్లేయర్ల జాబితాను నవంబర్‌‌‌‌ 15లోగా సమర్పించాలని ఐపీఎల్‌‌‌‌ గవర్నింగ్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏ ఫ్రాంచైజీలో ఎంత మంది ప్లేయర్లు ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై పూర్తి స్పష్టత రానుంది. ఫ్రాంచైజీలు రిలీజ్‌‌‌‌ చేసిన ప్లేయర్లు వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌‌‌‌ చేసుకోనున్నారు. 

తర్వాత వేలంలో అందుబాటులో ఉన్న ప్లేయర్ల జాబితాలను ఐపీఎల్‌‌‌‌ నిర్వాహకులు ఆయా ఫ్రాంచైజీలకు అందజేస్తారు. ఆ తర్వాత జాబితాను షార్ట్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ చేసి వేలంలో పాల్గొనే ప్లేయర్ల వివరాలను వెల్లడిస్తారు. గత సీజన్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌ ముగిసిన తర్వాత ఇప్పటి వరకు రెండు ట్రేడింగ్‌‌‌‌లు మాత్రమే జరిగాయి. ఇక ట్రేడింగ్‌‌‌‌ చాన్స్‌‌‌‌ లేకపోవడంతో ఫ్రాంచైజీలన్ని ప్లేయర్ల వేలంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది జరిగే మెగా లీగ్‌‌‌‌ తేదీలను ఇంకా ఖరారు చేయకపోయినా.. మార్చి 14 నుంచి మే 30 మధ్య నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. 2028 సీజన్‌‌‌‌కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్నారు