ఘట్‌‌‌‌‌‌‌‌ కేసర్‌‌‌‌‌‌‌‌: మున్సి పల్ ఆఫీసు లో జాబ్ ఇప్పిస్తానని..రిసార్ట్ లో లైంగికదాడి..రూ.4.50 లక్షలు లాక్కున్నడు

ఘట్‌‌‌‌‌‌‌‌ కేసర్‌‌‌‌‌‌‌‌: మున్సి పల్ ఆఫీసు లో జాబ్ ఇప్పిస్తానని..రిసార్ట్ లో లైంగికదాడి..రూ.4.50 లక్షలు లాక్కున్నడు
  •     ప్రతిఘటించడంతో దాడి 
  •     ఘట్​కేసర్​లో బాధితురాలి ఫిర్యాదు 

ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : పెండ్లయి భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఓ మహిళకు మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన లైంగికదాడి చేశాడో మోసగాడు..అంతేగాకుండా ఆమె నుంచి రూ.4.50 లక్షలు లాక్కున్నాడు. ఘట్​కేసర్​సీఐ కిరణ్‌‌‌‌‌‌‌‌ కథనం ప్రకారం..మల్లాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన 30 ఏండ్ల వివాహిత ఎనిమిదేండ్ల కింద పెండ్లి చేసుకుని..పలు కారణాలతో భర్త నుంచి విడిపోయి టైలరింగ్‌‌‌‌‌‌‌‌ పని చేసుకుంటూ బతుకుతోంది. ఆ డబ్బులు సరిపోకపోవడంతో ఏదైనా జాబ్​చేయాలని చూస్తున్నది. కొద్ది రోజుల కింద ఈమెకు పరిచయమైన భువనగిరికి చెందిన జగన్మోహన్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. 

దీనికి రూ.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. సోమవారం అతడికి ఫోన్​ చేసిన బాధితురాలు రూ.4.50 లక్షలు సిద్ధం చేసుకున్నానని చెప్పింది. దీంతో భువనగిరికి తీసుకెళ్తానని చెప్పి మల్లాపూర్‌‌‌‌‌‌‌‌లోని రత్నదీప్‌‌‌‌‌‌‌‌ వద్ద ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. తర్వాత మార్గ మధ్యలోని అంకుషాపూర్‌‌‌‌‌‌‌‌లో పెద్దసారు ఉన్నాడని, అతడిని కలిపిస్తానని ఓ రిసార్ట్‌‌‌‌‌‌‌‌కు తీసుకువెళ్లాడు. అయితే, సార్​ను కలవడానికి ముందు తను చెప్పినట్టు చేయాలని బ్లాక్​మెయిల్​ చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో లైంగికదాడి చేశాడు. తర్వాత ఆమె దగ్గర డబ్బులను లాక్కున్నాడు. ఆమె ప్రతిఘటించడంతో ముఖం, చేతులపై ఇష్టమున్నట్టు కొట్టాడు. తర్వాత రిసార్ట్​బయల వదిలేసి పరారయ్యాడు. దీంతో బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జగన్మోహన్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.