బరిలోకి పంత్‌‌‌‌, బుమ్రా!

బరిలోకి పంత్‌‌‌‌, బుమ్రా!

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌‌‌–ఎతో జరిగే మూడో అనధికార టెస్ట్‌‌‌‌లో టీమిండియా స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌ బుమ్రా, వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. వచ్చే నెల 7 నుంచి 10 వరకు లింక్లన్‌‌‌‌ వేదికగా ఈ మ్యాచ్‌‌‌‌ జరగనుంది. పక్కటెముకల నొప్పితో ఆటకు దూరంగా ఉన్న పంత్‌‌‌‌.. బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌ పొందిన తర్వాతే ఆడనున్నాడు. ప్రస్తుతం పంత్‌‌‌‌, బుమ్రా బెంగళూరులోని సెంటర్‌‌‌‌ ఆఫ్ ఎక్సలెన్స్‌‌‌‌లో శిక్షణ పొందుతున్నారు. 

నవంబర్‌‌‌‌ 19 నుంచి కివీస్‌‌‌‌తో ప్రారంభమయ్యే టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ కోసం ఈ ఇద్దరు టీమిండియాకు ఎంపికయ్యారు. అయితే సిరీస్‌‌‌‌కు ముందు మ్యాచ్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ కోసం ఇండియా–ఎ జట్టుతో కలిసి ఆడాలని భావిస్తున్నారు. అక్టోబర్‌‌‌‌లో జరిగిన ఆసియా క్రీడల తర్వాత బుమ్రా మళ్లీ బరిలోకి దిగుతుండగా, ఇరానీ కప్‌‌‌‌ టైమ్‌‌‌‌లో గాయపడిన పంత్‌‌‌‌ కోలుకుంటున్నాడు. ప్రస్తుతానికి బ్యాటింగ్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ మొదలుపెట్టినా.. కీపింగ్‌‌‌‌ ప్రారంభించలేదు.