హైలో ఓపెన్పై సింధు గురి

హైలో ఓపెన్పై  సింధు గురి

సార్‌‌‌‌బ్రూకెన్‌‌‌‌ (జర్మనీ): ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో రన్నరప్‌‌‌‌గా నిలిచిన పీవీ సింధు.. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే హైలో ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–500 టోర్నీ టైటిల్‌‌‌‌పై కన్నేసింది. జులైలో జపాన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నెగ్గిన సింధు.. పారిస్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌ వరకు చేరడంతో మంచి ఫామ్‌‌‌‌లోకి వచ్చింది. హైలో ఓపెన్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో సింధు.. నెస్లిహాన్‌‌‌‌ (టర్కీ)తో తలపడనుంది. 

మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌.. జోకిమ్‌‌‌‌ ఓల్డార్ఫ్‌‌‌‌ (ఫిన్లాండ్‌‌‌‌)తో ఆట మొదలుపెట్టనున్నాడు. ఆయుశ్‌‌‌‌ షెట్టి.. సు లియాంగ్‌‌‌‌ (తైవాన్‌‌‌‌)ను ఎదుర్కోనున్నాడు. గత కొంతకాలంగా ఇంటర్నేషనల్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌లో నిరాశపరుస్తున్న ఈ ఇద్దరు గాడిలో పడాలని ప్రయత్నిస్తున్నారు. ఇక హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రణయ్‌‌‌‌కు.. అలెక్స్‌‌‌‌ లానియర్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌) నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.