న్యూఢిల్లీ: ఇండియా బాక్సర్ ఆదిత్య.. వరల్డ్ బాక్సింగ్ అండర్–19 చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు. మాంటెనెగ్రోలోని బుద్వాలో ఆదివారం రాత్రి జరిగిన మెన్స్ 55 కేజీల సెమీస్‌లో ఆదిత్య 5–0తో నిహాత్ గసిమోవ్ (అజర్‌బైజాన్)పై గెలిచాడు.
మూడు రౌండ్ల పోరాటంలో ఇండియన్ బాక్సర్ అప్పర్ కట్స్, హుక్స్‌తో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. టైటిల్ ఫైట్‌లో ఆదిత్య.. ఇస్లాం మగోమెడోవ్ (రష్యా)తో తలపడనున్నాడు. విమెన్స్ 80 కేజీల్లో మేఘా షియోకంద్ ఆర్‌ఎస్‌సీ ద్వారా మీరిమ్ చినిబెకోవా (కిర్గిస్తాన్)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.
విమెన్స్ 65 కేజీ సెమీస్‌లో హర్షిక 2–3తో లారిన్ ఎల్మోర్ (అమెరికా) చేతిలో, 80+ కేజీ సెమీస్‌లో ప్రాచీ టోకాస్ ఓటమిపాలయ్యారు. దాంతో కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
