రాహుల్‌‌‌‌ కాన్వాయ్‌‌‌‌లో ప్రమాదం.. భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలు

రాహుల్‌‌‌‌ కాన్వాయ్‌‌‌‌లో ప్రమాదం.. భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలు
  •     రాహుల్​పై పరువునష్టం కేసును కొట్టేసిన సుల్తాన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ కోర్టు 

లక్నో: లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అగ్రనేత రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌‌‌‌‌‌‌‌లోని ఓ వెహికల్ ఉన్నట్టుండి సడెన్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ వేయడంతో చివర ఉన్న ఐదు వాహనాలు, ఒక అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని పూర్వాంచల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌వేపై హలియాపూర్‌‌‌‌‌‌‌‌ వద్ద సోమవారం ఉదయం జరిగింది. ఓ కేసు విచారణకు హాజరయ్యేందుకు రాహుల్ లక్నో విమానాశ్రయం నుంచి సుల్తాన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ కోర్టుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

ప్రమాద తీవ్రతకు కాన్వాయ్‌‌‌‌‌‌‌‌లో వెనుక వస్తున్న కార్ల ముందుభాగం దెబ్బతినగా.. పలువురు కార్యకర్తలు, భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని వివరించారు. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు సురక్షితంగా ఉందని, ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. 2018 కర్నాటక ఎన్నికల ప్రచారంలో అమిత్‌‌‌‌‌‌‌‌ షాపై రాహుల్‌‌‌‌‌‌‌‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించి సుల్తాన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లోని ప్రత్యేక ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం కేసు నడుస్తోంది. ఆ కేసులో సోమవారం తీర్పు వెలువడాల్సి ఉండటంతో రాహుల్ గాంధీ స్వయంగా కోర్టుకు హాజరుకావడానికి సుల్తాన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ బయలుదేరారు.

పరువునష్టం కేసు కొట్టివేత

పరువునష్టం కేసులో రాహుల్‌‌‌‌‌‌‌‌కు ఊరట లభించింది. ఏడేళ్ల క్రితం నాటి పరువు కేసులో ఆయనకు సుల్తాన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక కోర్టు క్లీన్‌‌‌‌‌‌‌‌చిట్ ఇచ్చింది. కేసును కొట్టివేసింది. ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అమిత్ షా పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ సుల్తాన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన స్థానిక బీజేపీ నేత, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిగింది. గతంలో రాహుల్ గాంధీ స్వయంగా కోర్టుకు వచ్చి బెయిల్ కూడా తీసుకున్నారు. యాక్సిడెంట్ తర్వాత రాహుల్ సుల్తాన్‌‌‌‌‌‌‌‌పూర్ కోర్టుకు వెళ్లారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కిందకు రావని, ఫిర్యాదుదారు విజయ్ మిశ్రా దీనికి బాధితుడు కారని కోర్టు స్పష్టంచేసింది. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో రాహుల్ గాంధీని నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. దీంతో కోర్టు బయట ఉన్న కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
 
మోదీకి చెప్పండి.. 30 సెకన్లలో నిరసనలు ఆపేస్తం!

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను పదవి నుంచి తొలగిస్తే 30 సెకన్లలో నిరసనలు ఆపేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఓట్ల చోరీ జరుగుతోందని నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌‌‌‌‌‌‌‌లో ఇండియా కూటమి ర్యాలీ నిర్వహించనుంది. అయితే, పండుగల సీజన్‌‌‌‌‌‌‌‌లో ర్యాలీ వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ర్యాలీని నవంబర్ 10 తర్వాత నిర్వహించాలని కోరింది. దీనిపై రాహుల్ ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో స్పందిస్తూ.. “ఢిల్లీ వ్యాపారులారా.. మీ ఆందోళన మాకు అర్థమవుతోంది. మీకు అండగా ఉంటాం. ప్రభుత్వం మెట్రో సేవలను నిలిపివేసింది. రోడ్లను మూసేసింది. రాజధానిని దిగ్బంధించింది. ఓట్ల చోరీ జరిగితే మీ దుకాణాలు, పొదుపు, పిల్లల భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉండవు. మోదీకి చెప్పండి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నంబర్ 4 జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను తొలగించండి. నిరసనలు 
30 సెకన్లలో ఆగిపోతాయి” అని పేర్కొన్నారు.