పార్లమెంట్‌‌ ఆవరణలో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన దట్టమైన పొగలు

పార్లమెంట్‌‌ ఆవరణలో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన దట్టమైన పొగలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌ ఆవరణలోని పరిపాలనా భవనం నార్త్‌‌ బ్లాక్‌‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్‌‌ టెర్రస్‌‌పై ఉన్న సెంట్రల్‌‌ ఏసీ బాయిలర్‌‌లో షార్ట్‌‌ సర్క్యూట్‌‌ కారణంగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నార్త్‌‌ బ్లాక్‌‌ పైకప్పుపై వెల్డింగ్‌‌ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా షార్ట్‌‌ సర్క్యూట్‌‌ జరిగి ఏసీ బాయిలర్‌‌కు మంటలు అంటుకున్నాయని అధికారులు వెల్లడించారు.