- ఇబ్రహీంపట్నంలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు : తమను డ్రంక్అండ్డ్రైవ్లో పట్టుకున్నారనే కోపంతో మందుబాబులు ఏకంగా ట్రాఫిక్ పోలీసుల బ్రీత్ అనలైజర్ మెషీన్ను ఎత్తుకువెళ్లారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో జరిగింది. ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్ధరాత్రి నాగార్జున సాగర్ రోడ్డుపై శాస్త్ర గార్డెన్స్వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పట్టుబడడంతో కేసులు నమోదుచేశారు. సోమవారం ఉదయం ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ లో చూడగా ఒక బ్రీత్ అనలైజర్ మెషీన్కనిపించలేదు. కేవలం నాలుగు మాత్రమే కనిపించాయి.
ఎక్కడా మిస్సయ్యే అవకాశం లేకపోవడంతో డ్రంక్అండ్డ్రైవ్తనిఖీల వద్దనే ఎవరో ఎత్తుకెళ్లి ఉంటారన్న అనుమానంతో పట్టుబడిన మందుబాబులను స్టేషన్కు పిలిచి విచారిస్తున్నారు. ‘ డ్రంక్అండ్డ్రైవ్చేస్తూ దొరికిపోయారు ..అది మీ తప్పే..మా మెషీన్ను తీసుకుని మీరేం చేసుకుంటారు. తీస్తే దయచేసి ఇచ్చెయ్యండి’ అని బతిమాలుకుంటున్నారు. కాగా, ఈ విషయమై ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ సీఐ జితేందర్రెడ్డిని వివరణ కోరగా, బ్రీత్ఎనలైజర్మెషీన్పోయింది నిజమేనని, వెతుకుతున్నామని చెప్పారు.
