సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్‌తో సోమవారం (అక్టోబర్ 27) మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–బి మ్యాచ్‌లో పంజాబ్ నిలకడగా ఆడుతోంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (81), సలీల్ అరోరా (57 బ్యాటింగ్), రమన్‌దీప్ సింగ్ (52) హాఫ్ సెంచరీలు చేయడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 289/6 స్కోరు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆరంభంలో హైదరాబాద్‌కు బౌలర్లు షాకిచ్చారు. 62 రన్స్‌కే విహాన్ మల్హోత్రా (12), హర్నూర్ సింగ్ (17)ను ఔట్ చేశారు. ఈ దశలో ప్రభ్‌సిమ్రన్.. ఉదయ్ శరన్ (16)తో మూడో వికెట్‌కు 43 రన్స్ జోడించి ఔటయ్యాడు.
జషన్‌ప్రీత్ సింగ్ (45) మెరుగ్గా ఆడటంతో పంజాబ్ 182/5 స్కోరుతో నిలిచింది. చివర్లో సలీల్, రమన్‌దీప్ ఆరో వికెట్‌కు 93 రన్స్ జత చేశారు. ఎమన్‌జ్యోత్ సింగ్ చహల్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. రక్షణ్ రెడ్డి 2 వికెట్లు తీశాడు.
