బంగారం రేట్లు పైపైకి.. మంగళవారం హైదరాబాదులో గ్రాము ఎంతంటే..?

బంగారం రేట్లు పైపైకి.. మంగళవారం హైదరాబాదులో గ్రాము ఎంతంటే..?

ఈ వారం ప్రారంభం నుంచి బంగారం రేట్లు మళ్లీ జోరుగా పెరుగుతున్నాయి. దసరా పండుగ తర్వాత నేలచూపులు చూసిన బులియన్ మార్కెట్లు మళ్లీ పెరుగుతుండటం ఇన్వెస్టర్లకు ఊరటను కలిగిస్తోంది. అయితే అంతర్జాతీయంగా బంగారం, వెండి రేట్లు పెరిగేందుకు అనుకూలమైన పరిస్థితులు కనిపించకపోవటం కూడా కొంత వెనుకడుగు వేసేలా చేస్తోంది పెట్టుబడిదారులను. ఈ సమయంలో రిటైల్ ఆభరణాల షాపింగ్ చేయాలని భావిస్తున్న ఇన్వెస్టర్లు మాత్రం ముందుగా తమ నగరాల్లో మారిన ధరలను పరిశీలించి ముందుకు సాగటం బెటర్. 

అక్టోబర్ 27న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.54 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 329గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 135గా కొనసాగుతోంది. 

ALSO READ : మారనున్న ఎల్‌‌టీసీజీ  ట్యాక్స్? ..  బడ్జెట్‌‌కు ముందే నిర్ణయం

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 27, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 20వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.220 దగ్గర ఉంది.