KPHB కాలనీలో విషాదం.. ఎవరినీ ఏం అడగొద్దని గోడపై రాసి చనిపోయిన కుటుంబం !

KPHB కాలనీలో విషాదం.. ఎవరినీ ఏం అడగొద్దని గోడపై రాసి చనిపోయిన కుటుంబం !

హైదరాబాద్ సిటీలోని KPHB కాలనీలో విషాద ఘటన వెలుగుచూసింది. రెండేళ్ల కన్న కూతురిని చంపేసి.. భార్యాభర్త కూడా చనిపోయిన ఘటన KPHB కాలనీ ఫేజ్-3లో విషాదం నింపింది. కె.పి.హెచ్.బి కాలనీ 3వ ఫేజులో గోపీ, సమత అనే భార్యాభర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దంపతులతో పాటు ఇంటిలో వారి కుమార్తె రెండేళ్ళ చిన్నారి స్నిగ్ధ మృత దేహం కూడా పోలీసులు గుర్తించారు. ఈ కుటుంబం పశ్చిమ బెంగాల్కు చెందిన వారిగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

చిన్నారిని హత్య చేసి వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేశారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, వేరే ఎవరిని ఎటువంటి వివరాలు అడగకూడదని గోడపై రాసి చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.