5 ఓవర్లలో 100 రన్స్ అంటే మామూలు విషయం కాదు.. అభిషేక్, వైభవ్ దూకుడుకు శ్రేయస్ అయ్యర్ షాక్

5 ఓవర్లలో 100 రన్స్ అంటే మామూలు విషయం కాదు.. అభిషేక్, వైభవ్ దూకుడుకు శ్రేయస్ అయ్యర్ షాక్

Shreyas Iyer: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 (3rd T20I) మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది భారత జట్టు. ఈ విజయం తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మాట్లాడుతూ.. ఇండియన్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల విధ్వంసకర బ్యాటింగ్ పై ప్రశంసల జల్లు కురిపించాడు.

అభిషేక్, వైభవ్ ఆట చాలా బాగుంది: శ్రేయస్

మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడారు. వారిద్దరూ ఆడిన షాట్లు చూసేందుకు నా రెండు కళ్లు సరిపోలేదని పేర్కొన్నాడు. నిజం చెప్పాలంటే.. అంతర్జాతీయ క్రికెట్ లో కేవలం 5 ఓవర్లలోనే 100 పరుగులు చేయడం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదన్నాడు. ఇది ఖచ్చితంగా మా అగ్రశ్రేణి ప్రదర్శనల్లో ఒకటి అని శ్రేయస్ అయ్యర్ కొనియాడాడు. ఇక నేను, సంజు శాంసన్ క్రీజులో ఉన్నప్పుడు బంతి బాగా స్వింగ్ అవుతోంది, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ అభిషేక్, వైభవ్ అంత ఈజీగా ఎలా ఆడగలిగారోనని షాక్ అయినట్ఉల తెలిపాడు. 

బౌలింగ్ వ్యూహంపై శ్రేయస్ క్లారిటీ: 

న్యూజిలాండ్ 198/3 భారీ స్కోరు సాధించడంపై శ్రేయస్ స్పందిస్తూ.. బౌలింగ్ ప్లానింగ్ ఎలా మార్చుకున్నదీ వివరించాడు. 10 ఓవర్ల తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. బౌలర్లు హార్డ్ లెంగ్త్ లేదా హాఫ్ వాలీలు వేస్తే బ్యాటర్లు వాటిని ఈజీగా స్టాండ్స్‌లోకి పంపిస్తున్నారని గుర్తించాను, అందుకే బౌలర్లని.. వీలైనన్ని ఎక్కువ యార్కర్లు వేయమన్నాను.. అవసరమైతే ఆరు బంతులు కూడా యార్కర్లే వేయాలని చెప్పా.. దీంతో పరుగుల వేగాన్ని ఓవర్‌కు 8 లేదా 9 రన్స్ కి పరిమితం చేయడమే మా లక్ష్యం అన్నాడు. 

►ALSO READ | చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా?.. నెంబర్ 33 సీక్రెట్ కోడ్‌తో CSK మైండ్ గేమ్‌!

సిరీస్ విజయంపై ఆనందం: 

మూడో మ్యాచ్‌తోనే సిరీస్‌ను కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆటగాళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.