Reality Movie Audio Rights: రిలీజ్‌కు ముందే కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' రికార్డ్.. ఊహించని ధరకు ఆడియో రైట్స్ సేల్!

Reality Movie Audio Rights: రిలీజ్‌కు ముందే కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' రికార్డ్.. ఊహించని ధరకు ఆడియో రైట్స్ సేల్!

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఈసారి సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, తన నెక్స్ట్ మూవీ 'రియాలిటీ'తో నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే ఆడియో హక్కుల రూపంలో భారీ డీల్ కుదరడం ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

లేటెస్ట్ గా 'రియాలిటీ' చిత్రం ఆడియో హక్కులు ఏకంగా రూ.3.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ప్రముఖ మ్యూజిక్ సంస్థ సరిగమ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా ఈ డీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే విడుదలైన తొలి పాట 'భజ గోవిందం'కు మంచి గుర్తింపు లభించడంతో సినిమాపై మ్యూజికల్ బజ్ పెరుగుతోంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా చేపడుతున్నారు.

ఈ పాటే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ఈ గీతానికి సనారే సాహిత్యం అందించగా, వైకోమ్ విజయలక్ష్మి ఆలపించారు. జీవితంలో ఉన్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించాలనే సందేశంతో సాగిన ఈ పాట, సినిమా కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. టైటిల్ గ్లింప్స్‌లోనూ ఈ గీతాన్ని ఉపయోగించడం విశేషం. ఈ 'రియాలిటీ' మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

►ALSO READ | Jailer 2 Box Office: బాక్సాఫీస్‌పై సూపర్‌స్టార్ 'జైలర్ 2' సునామీ.. 12 రోజుల్లోనే కోటి టికెట్లు సేల్!

'రియాలిటీ' కిరణ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తోంది. సుధాకర్ చగంటి, జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవికా భట్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్‌కుమార్, సాయికుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశ్వాస్ డానియల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంతోష్ నాయుడు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి రూ.3.5 కోట్ల ఆడియో డీల్‌తో వార్తల్లో నిలిచిన 'రియాలిటీ'.. విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి..