సూపర్ స్టార్ రజినీకాంత్ అంటేనే ఒక సునామీ. 70 ప్లస్ వయసులోనూ తన క్రేజ్ తో బాక్సాఫీస్ వద్ద ఆయన చూపిస్తున్న విద్వంసానికి యావత్ చిత్రసీమ మైమరిచిపోతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ‘జైలర్ 2’ థియేటర్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ.. కోలివుడ్‌లో ఇప్పటివరకు ఏ సినిమా సాధించని అద్భుతమైన ఫీట్‌ను నమోదు చేసింది.
లేటెస్ట్ గాఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ 'బుక్‌మైషో' లో అత్యంత వేగంగా 1 కోటి టికెట్లు అమ్ముడైన తొలి తమిళ చిత్రంగా నిలిచింది. కేవలం 12 రోజుల్లోనే ఈ రికార్డును సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో మొదటి భాగం జైలర్' పేరిట ఉన్న లైఫ్‌టైమ్ BMS రికార్డును విడుదలై పది రోజులు కాకముందే అధిగమించిన 'టైగర్' ముత్తువేల్ పాండ్యన్, 12వ రోజుతో ఈ మైలురాయిని సునాయాసంగా దాటేశాడు. ఇప్పటివరకు కేవలం హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలకు మాత్రమే పరిమితమైన ఈ ఐకానిక్ 1-కోటి క్లబ్‌లో అడుగుపెట్టిన మొదటి తమిళ డైనమైట్‌గా 'జైలర్ 2' రికార్డుకెక్కింది.
►ALSO READ | AR Rahman: ముందు ట్రోల్స్ చేస్తారు.. తర్వాత సారీ చెబుతారు.. రామాయణ వివాదంపై రెహమాన్ కౌంటర్
కేవలం టికెట్ల సంఖ్యలోనే కాదు, వసూళ్లలోనూ రజినీ మేనియా పూనకాలు తెప్పిస్తోంది. 12 రోజుల్లోనే భారతదేశ వ్యాప్తంగా రూ. 408.15 కోట్ల నెట్ వసూలు చేసి, త్వరలోనే రూ. 500 కోట్ల క్రాస్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక ఓవర్సీస్‌లోనూ రూ. 255.50 కోట్ల గ్రాస్ రాబట్టడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ. 733.35 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది.
అనిరుధ్ అందించిన మైండ్ బ్లాకింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సూర్య, విద్యుత్ విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి వంటి నయా విలన్లు ఒకవైపు.. హృతిక్ రోషన్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్‌ల క్రేజీ కామియోలు థియేటర్లలో రచ్చ లేపుతున్నాయి. రూ. 1000 కోట్ల దిశగా దూసుకుపోతున్న 'జైలర్ 2', ఇండియన్ సినిమా హిస్టరీలోనే రజినీకాంత్ బాక్సాఫీస్ స్టామినాకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
