వరి విత్తనాలు కొనుగోలుకు సెల్ఫ్ డిక్లరేషన్ కావాలంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని.. అలాంటి సమాచారాన్ని రైతులు ఎవరూ నమ్మొద్దని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు నోట్ రిలీజ్ చేశారు డైరెక్టర్ డాక్టర్ బి గోపి. విత్తనాల కొనుగోలుపై రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారాయన.
మార్కెట్ లో ఉన్న డీలర్స్ సెల్ఫ్ డిక్లరేషన్ కోసం ఒత్తిడి చేస్తే వ్యవసాయ శాఖ అధికారులకు కంప్లయింట్ చేయాలని.. అలాంటి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్నాయని.. సాగునీటి కొరత ఉందని.. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు వ్యవసాయ శాఖ డైరెక్టర్.
రైతులు వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగు చేయాలని.. అదే విధంగా కందులు, పెసర్లు, సజ్జలు వంటి ఆరుతడి పంటలు సాగు చేస్తే మంచిది అని సలహా ఇచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు. చెరువులు, బోర్ల కింద సాగు అయ్యే భూముల్లోనూ వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.
ALSO READ : సీఎం సారూ.. 20 ఏళ్లుగా పట్టించుకోవట్లే.
వరి విత్తనాలు కొనుగోలును సెల్ఫ్ డిక్లరేషన్ అంటూ వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దని.. రైతులు ఎవరూ అయోమయానికి గురి కావొద్దని స్పష్టం చేసిన వ్యవసాయ శాఖ డైరెక్టర్.. నకిలీ విత్తనాలు అమ్మినా.. సెల్ఫ్ డిక్లరేషన్ అడిగిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్గిగా వార్నింగ్ ఇచ్చారు.
