జ్యోతిషశాస్త్రంలో గురు గ్రహ సంచారానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. . జీవితం అన్ని విధాలా సాఫీగా, హ్యాపీగా సాగిపోవాలంటే గురుడి అనుగ్రహం చాలా అవసరం. అంతటి ప్రాముఖ్యత ఉన్న గురుడు 2026 అక్టోబర్ 31 మధ్యాహ్నం 12:50 గంటలకు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. సింహరాశిలో గురువు ఈ సంచారంలో తప్పకుండా వివిధ రాశుల వారి తలరాతలు మార్చే అవకాశం ఉంది. ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం . గురుడు ధనం, గృహం, సంతానం, శుభ కార్యాలు, శుభ పరిణామాల విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఒకరాశి నుంచి మరో రాశిలోకి మారినప్పుడు 12 రాశుల వారి జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని పండితులు చెబుతున్నారు.
మేషరాశి: సింహ రాశిలో గురుడి సంచారం వలన ఈ రాశి వారు చేపట్టే ప్రతి పనిలోనూ విజయాలు అందుకుంటారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. వ్యాపార రంగంలో పాత సమస్యలు తొలగిపోయి లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది.గురు గ్రహం అనుకూలత వలన పట్టిందల్లా బంగారం అవుతుంది. సుఖ సంతోషాలకు పరిమితి ఉండదు. . ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తేలికగా నెరవేరుతుంది. బాగా డబ్బు కలిసి వస్తుంది. జీవిత భాగస్వామికి మంచి అదృష్టం పడుతుంది. ప్రేమ పెళ్లి వ్యవహారాలు అనుకూలిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభరాశి: ఈ రాశికి 4వ స్థానంలో గురుడు సింహరాశిలో సంచరించే సమయంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాభవం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి, ఉద్యోగం మారాలనుకుంటున్నవారికి ఇది చాలా అనుకూల సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.
మిథునరాశి: సింహరాశిలో గురుడి సంచారం వలన ఈ రాశివారికి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యాపారాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటకరాశి: గురుడు సింహరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. . ఈ సమయంలో మాటతీరుతో ఇతరులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో చర్చలు సానుకూలంగా సాగి కీలక ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. బ్యాంకు నిల్వలు పెరగడంతో పాటు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమై, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.సంతానానికి సంబంధించిన దీర్ఘకాలిక ఆందోళనలు తొలగి కుటుంబంలో ప్రశాంతత నెలకొనవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.
సింహరాశి: ఇదే రాశిలో గురుడి సంచారం వలన ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి. చేతి వృత్తుల వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది.కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కన్యారాశి: సింహరాశిలో గురుడి సంచారం వలన ఈ రాశి వారికి విదేశీ సంపాదన పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార పరంగా ప్రయోజనకరంగా ఉండవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం లభించవచ్చు. కొత్త ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులను నియంత్రించడం, భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
తులారాశి: సింహ రాశిలో ధన కారకుడు గురువు సంచారం వలన ఈ రాశి వారు ఉన్నత స్థాయికి చేరుకొనే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.కార్యాలయంలో మీ ప్రతిభను, కష్టాన్ని పైఅధికారులు గుర్తిస్తారు. తోటి ఉద్యోగుల సహకారంతో కఠినమైన ప్రాజెక్టులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు.
వృశ్చికరాశి: గురుడు సింహరాశిలో సంచారం వలన ఈ రాశి ఉద్యోగస్తులకు భౌతిక సుఖ సౌకర్యాలు సమకూరుతాయి. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు రాకుండా ఓపిక వహించాలి. ఉద్యోగం మారాలని ఆలోచించే వారికి అనుకూలమైన వాతావరణం ఉంది. సరైన సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. దర్జాగా, గౌరవప్రదంగా జీవితం గడిపే అవకాశం ఉంది.అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి
ధనుస్సురాశి: సింహరాశిలో గురుడి సంచారం వలన ఈ రాశి వారికి సంపద పెరిగే అవకాశం ఉంది. కొత్త వస్తువుల కొనుగోలు చేస్తారు. ఇంటి బయటా ప్రాధాన్యత పెరుగుతుంది. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది. కుటుంబంలో శుభపరిణాలు చోటు చేసుకుంటాయని పండితులు చెబుతున్నారు. చేతి వృత్తుల వారికి.. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
మకరరాశి: అష్టమ స్థానంలోకి గురుడి సంచారం కారణంగా ఈ రాశివారికి శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం పెరిగి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను మించిన పురోగతి ఉంటుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఉన్నత స్థాయి వెళ్లే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయని పండితులు చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలపి జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
కుంభరాశి: ఈ రాశివారికి సప్తమ స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల అనేక విధాలుగా అదృష్టం తలుపు తడు తుంది. ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోతుంది. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగాఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసు నుంచి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
మీనరాశి: సింహరాశిలో గురుడి సంచారం వలన ఈ రాశి వారికి జీవితాల్లో సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది. కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. భూమి, ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కార్యాలయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. సామాజిక హోదా పెరగడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. అదృష్టం తోడవడంతో పనులన్నీ సజావుగా సాగుతాయి. ఇక వ్యాపారస్తుల విషయానికొస్తే మూడు పువ్వులు ఆరుకాయలుగా వీరి జీవితం కొనసాగుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
