Health Tips: ఉసిరి ఔషధాల గని.. రోజూ ఒకటి తింటే గుండె జబ్బులు సైతం మాయం!

 Health Tips: ఉసిరి ఔషధాల గని.. రోజూ ఒకటి తింటే గుండె జబ్బులు సైతం మాయం!

కూరగాయల మార్కెట్ వెళ్లినపుడు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నా ఉసిరి జోలికి చాలా మంది వెళ్లరు. చట్నీ పెట్టేవాళ్లు మాత్రమే కిలోల లెక్కన కొంటుంటారు . కానీ ఉసిరి చేసే మేలు గురించి తెలిస్తే ఇక నుంచి ఇంట్లో ఉండేలా ప్లాన్ చేస్తారు. రోజూ కనీసం ఒక ఉసిరి తింటారు. ఆ లాభాలేంటో.. ఎందుకు ఉసిరి ప్రతిరోజు ముఖ్యమో తెలుసుకోండి.

ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైలీ డైట్ లో  భాగం చేస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలకి ఫుల్స్ స్టాప్  పెట్టొచ్చు. 

అవేంటంటే: 

  • ఉసిరి లివర్ పనితీరుని మెరుగుపరుస్తుంది. 
  • జీర్ణానికి సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తుంది.
  • ఉదయాన్నే  ఖాళీ కడుపుతో ఉసిరి పొడి తీసుకుంటే దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
  •  అంతేకాదు ఉసిరిని తరచూ తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

 

  • కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఉసిరిలో మెండుగా ఉన్నాయి. 
  • ఉసిరిలోని 'లినోయిక్ యాసిడ్' వల్ల కామెర్లు తగ్గుతాయి. 
  • అలాగే గుండె జబ్బుల నుంచి కూడా బయటపడొచ్చు.

 

  • ఉసిరి రోజూ తింటే కాల్షియం పెరిగి ఎముకలు, దంతాలు, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా పెరుగుతాయి.
  • ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. 
  • ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. 
  • శరీరంలోని కొవ్వుని కూడా తగ్గిస్తుంది. 

 

  • కంటిచూపుని మెరుగుపరచడానికి ఉసిరి చాలా సహాయపడుతుంది.
  • కళ్లు ఎర్రబడటం, దురద వంటి సమస్యల్ని కూడా తగ్గిస్తుంది.