అందంగా కనిపించాలనే అందరూ కోరుకుంటారు. దానికోసం లేటెస్ట్ ఫ్యాషన్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంటారు. కానీ కొంతమంది అమ్మాయిలు పొట్టిగా ఉన్నామనే ఫీలింగ్ తో ఫ్యాషన్ కు దూరంగా ఉంటారు. నచ్చిన డ్రెస్సులు వేసుకోవాలన్నా పొట్టిగా కనిపిస్తామేమోనన్న ఫీలింగ్ తో వాటికి దూరంగా ఉంటారు. అయితే ఇలాంటి వారు కొన్ని టిప్స్ ఫాలో అయితే వారికి నచ్చిన డ్రెస్సులనే హ్యాపీగా వేసుకోవచ్చు.
పొడవాటి డ్రెస్సులు వద్దు
పొట్టిగా ఉన్నవాళ్లు పొడవాటి డ్రెస్సులను ప్రిఫర్ చేయకూడదు. అంటే ఫ్లోర్ లెన్త్ డ్రెస్సులు వేసుకోకూడదు. దానివల్ల మరింత పొట్టిగా కనిపించే ఛాన్స్ ఉంది. అనార్కలి, లాంగ్ ఫ్రాక్ ల వంటి డ్రెస్సుల విషయంలో మరీ ఎక్కువ పొట్టిగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రెస్సులను వేసుకోకూడదు అని డిసైడ్ కాకుండా అందులో కొన్నింటిని సెలెక్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పొడవుగా కాకుండా కాస్త తక్కువ పొడవులో ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ కచ్చితంగా అలాంటివే వేసుకోవాల్సి వస్తే హీల్స్ పై వేసుకుంటే బెటర్.
డిజైనింగ్ డ్రెస్సులు అందం
పొట్టిగా, లావుగా ఉన్నవాళ్లకు డిజైనింగ్ మెటీరియల్ తో ఉన్న డ్రెస్సులు అందంగా ఉంటాయి. పెద్ద పెద్ద పువ్వులు, బాక్సులు వంటి డ్రెస్సులు వీరికి నప్పుతాయి. చీరల్లో కూడా పెద్ద పెద్ద డిజైన్లు ఉన్న చీరలు పొట్టిగా ఉన్నవారికి బాగా సూటవుతాయి.
మిక్సింగ్ కలర్స్ కంటే ప్లెయిన్ బెటర్
ప్లెయిన్ కలర్ డ్రెస్సులేవైనా పొట్టిగా ఉన్న వారిని స్టైలిష్ గా కనపడేటట్టు చేస్తాయి. అలా కాకుండా మిక్సింగ్ కలర్స్ వేస్తే హైట్ క్లియర్ గా కనిపిస్తుంది. అనార్కలి వేసుకోవాలనుకునేవారు ఒకే రంగులో ఉన్న అనార్కలీని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. మెరుపులు కూడా సాధ్యమైనంత తక్కువగా ఉంటే బెటర్.
లైట్ కలర్స్ లో మరింత అందం
డార్క్ కలర్స్ కంటే లైట్ కలర్స్ పొట్టిగా ఉన్న వాళ్ళకు అందంగా ఉంటాయి. లైట్ కలర్స్ శారీస్, చుడీదార్స్, షర్ట్స్ పొట్టిగా ఉండేవాళ్ల కు బాగా సూట్ అవుతాయి.
మంచి ఫ్యాబ్రిక్ ను ఎంచుకుంటే బెస్ట్
మంచి ఫ్యాబ్రిక్ దుస్తులు వేసుకున్నా హైట్ గా కనిపిస్తారు. క్రేప్, జార్జట్ వంటి ఫ్యాబ్రిక్స్ బాగా సూటవుతాయి. అలాగే శరీరానికి బాగా అతుక్కునే బట్టలు కాకుండా కాస్త లూజ్ గా ఉండే బట్టలు వేసుకుంటే కూడా పొట్టిగా కనిపించరు.
