ఉసిరి పేరు వింటేనే నోట్లో నిళ్లేరుతాయి. ఎప్పుడెప్పుడు తిందామా! అని నోరూరుతుంది. ఆల్రెడీ ఉసిరి సీజన్ మొదలైంది. అందుకే ఉసిరి స్పెషల్ రెసిపీస్ మీకోసం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యానిచ్చే ఉసిరితో చేసి వెరైటీ వంటకాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం...
ఉసిరితో రైస్ తయారీకి కావాల్సినవి
- బియ్యం- ఒక కప్పు
- ఉసిరికాయ తురుము - అరకప్పు
- పోపుదినుసులు- ఒక టీ స్పూన్
- ఎండు మిర్చి- రెండు
- పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు
- కరివేపాకు- రెండు రెమ్మలు
- కారం, ఉప్పు- తగినంత
- వెల్లుల్లి రెబ్బలు- నాలుగు
- నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర కొద్దిగా
ఉసిరి రైస్ తయారీ విధానం
ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేడిచేసి ఎండుమిర్చి, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉసిరికాయ తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, అన్నం వేసి మరికాసేపు వేగించాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఉసిరి కాయ రైస్ రెడీ.
ఉసిరి పప్పు తయారీకి కావాల్సినవి
- ఉసిరికాయ తురుము - ఒక కప్పు
- కందిపప్పు- ఒక కప్పు
- ఎండుమిర్చి- రెండు
- పోపు దినుసులు- ఒక టీ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు
- కరివేపాకు-రెండు రెమ్మలు
- వెల్లుల్లి రెబ్బలు- నాలుగు
- ఉప్పు, కారం తగినంత
- పసుపు- చిటికెడు
- టొమాటో తరుగు - ఒక టేబుల్ స్పూన్
- కొత్తిమీర- కొద్దిగా
- ఇంగువ - చిటికెడు
- నూనె-రెండు టేబుల్ స్పూన్లు
- ధనియాల పొడి- ఒక టీ స్పూన్
ఉసిరి పప్పు తయారీ విధానం
పాన్ లో నూనె వేడి చేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగించాలి. అందులో ఉసిరికాయ తురుము కూడా వేసి బాగా కలపాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు, ఉప్పు, పసుపు, కారం, టొమాటో తరుగు ధనియాల పొడి వేసి ఉడికించాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేస్తే టేస్టీ అండ్ హెల్దీ ఉసిరికాయ పప్పు రెడీ.. మరి ఇంకెందుకు శీతాకాలంలో ఇమ్యూనిటి పవర్ పెంచే ఉసిరికాయతో టేస్ట్ వంటకాలను లాగించేద్దామా మరి..!
