ధ్యానంతో ఆరోగ్యం: నిద్ర సరిపోవడం లేదా.. 10 నిమిషాల ధ్యానం.. 44 నిమిషాల నిద్రతో సమానం

 ధ్యానంతో ఆరోగ్యం: నిద్ర సరిపోవడం లేదా.. 10 నిమిషాల ధ్యానం.. 44 నిమిషాల నిద్రతో సమానం

మనిషికి తిండి ఎంత ముఖ్యమో.. కంటి నిండా నిద్ర కూడా అంతే అవసరం. అయితే ఈ రోజుల్లో చాలామందికి నిద్ర చాలట్లేదు. ప్రతి ఒక్కరు రోజులో ఎనిమిది గంటలు నిద్రపోతేనే.. వాళ్ల ఆరోగ్యం బాగుంటుంది. అన్ని గంటలు కుదరకపోయినా కనీసం ఆరున్నర గంటలైనా పడుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండట్లేదు. 

అందుకే దానికి బదులుగా ధ్యానం లాంటి వ్యాయామం చేస్తే చాలంటున్నారు నిపుణులు. 'ఆన్​ లైన్ క్లాసులు.. ఆన్ లైన్ ఎగ్జామ్స్' అని స్టూడెంట్స్... ఓవర్ టైమ్, ప్రమోషన్ వర్క్' అని ఉద్యోగులు... ఇలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతల కోసం కష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం వాటిలో అందరూ కోల్పోతోంది నిద్రే. ఇదే విషయం అమెరికాకు చెందిన కొందరు సైంటిస్టులు చేసిన స్టడీలో వెల్లడైంది 

అలసిపోతే కష్టమే..

ఇటు మానసికంగా... అటు శారీరకంగా మనిషి అలసిపోయినప్పుడు... తాను చేస్తున్న పనిలో విజయం సాధించలేడు. అలా అలసిన ప్రాణానికి విశ్రాంతి కావాలి. అది నిద్ర వల్లే అందుతుంది. కాకపోతే నిద్ర సరిగా లేనప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు ధ్యానం చేస్తే సరిపోతుంది. 

నిద్రైనా  పోవాలి... ధ్యానమైనా చేయాలి

 రోజుకు సరిపడా నిద్ర లేకపోతే... అది కచ్చితంగా పనితీరు, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే వారానికి 70 నిమిషాలు లేదా రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేయాలి. అలాచేస్తే, 44 నిమిషాలు నిద్రపోతే దొరికేంత విశ్రాంతి లభిస్తుంది అంటున్నారు నిపుణులు.

ఈ స్టడీ కూడా అదే చెబుతోంది...

మొత్తం 105 మందిపై ఈ స్టడీ చేశారు సైంటిస్టులు. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? దాని వల్ల ఎలాంటి ఉపయోగాలుంటున్నాయి? వంటి విషయాలపై ఈ సర్వే జరిగింది. అందులో 40 శాతం మంది తాము వారానికి యాభై గంటలు పని చేస్తున్నట్లు చెప్పారు. అలాగే రోజుకు కనీసం ఆరు గంటలు కూడా సరిగా నిద్రపోవట్లేదని చెప్పారు. అయితే అందులో కొంతమంది నిద్ర సరిపోనప్పుడు ధ్యానం చేస్తే ఎంతో రిలీఫ్ లభిస్తోందని చెప్పారు.

–వెలుగు,లైఫ్​–