20 లక్షల ఫాలోవర్లు ఉన్నా.. ఎన్నికల్లో వచ్చింది 33 ఓట్లే.. రాజకీయం అంటే అట్లుంటది మరి!

20 లక్షల ఫాలోవర్లు ఉన్నా..  ఎన్నికల్లో వచ్చింది 33 ఓట్లే..  రాజకీయం అంటే అట్లుంటది మరి!

లా పాసైనంత ఈజీ కాదు బాబూ సోడా కొట్టడం అంటే.. అనే డైలాగ్ గుర్తింది కదా. ఆ డైలాగ్ ఇక్కడ కూడా వర్తిస్తుందేమో. మనోభావాలు దెబ్బతీసేందుకు కాదు కానీ..  జ్యోతిష్యం చెప్పినంత ఈజీ కాదు ఎన్నికల్లో గెలవాలంటే అనే పరిస్థితి ఆ జ్యోతిష్యుడిది. ఎందుకంటే సోషల్ మీడియాలో రెండు మిలియన్ల ఫాలోవర్లు అంటే 20 లక్షల ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు చూసి నేనేంటి.. నా క్రేజేంటి.. వచ్చిన ఓట్లేంటి..? అంటే సోషల్ మీడియా క్రేజు ఎన్నికల్లో తుస్సేనా..? అనుకునే పరిస్థితి. 

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా ఓసియన్ తహసీల్‌లోని ఇండోన్ కి ధాని-II గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ప్రముఖ జ్యోతిష్యుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓంప్రకాష్ బిష్ణోయ్‌కు ఘోర పరాజయం ఎదురైంది. 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నప్పటికీ, సుమారు 1,600 ఓటర్లున్న గ్రామంలో అతనికి కేవలం 33 ఓట్లే వచ్చాయి.

ఓంప్రకాష్ బిష్ణోయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 14 లక్షలు, ఫేస్‌బుక్‌లో 2.32 లక్షలు, యూట్యూబ్‌లో 5.5 లక్షల సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నారు. స్థానిక గోశాల అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్న అతను తన స్వగ్రామంలోనే పోటీ చేశారు. ఆన్‌లైన్ ప్రజాదరణతో ఓట్లు వస్తాయని ఆశించినా ఫలితం చూసి షాకయ్యారు. 

ఈ ఫలితం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖాలు చదివి భవిష్యత్తు చెప్పే వ్యక్తి తన  ఎన్నికల తన భవిష్యత్తు ఏంటో ఊహించలేకపోయాడు.. అని అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఓంప్రకాష్ బిష్ణోయ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపి, ఓటమిని స్వీకరించారు.