బాసుమతి రైతుల పంట పండింది.. గల్ఫ్లో ఫుల్ డిమాండ్ .. బిర్యానీ రేట్లు పెరుగుతాయా..?

బాసుమతి రైతుల పంట పండింది.. గల్ఫ్లో ఫుల్ డిమాండ్ .. బిర్యానీ రేట్లు పెరుగుతాయా..?

ఎల్ నినో ఎఫెక్ట్ ఒకవైపు.. పశ్చిమాసియా నుంచి డిమాండ్ మరోవైపు.. వెరసి బాసుమతికి భలే డిమాండ్ వచ్చింది. ధరలు ఒక్కసారిగా పెరగటంతో బాసుమతి రైతుల పంట పండిందని అంటున్నారు మార్కెట్ అనలిస్టులు. బాసుమతి ఎక్కువగా పండించే పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో క్వింటాల్ కు వెయ్యి రూపాయలకు పైగా ధరలు పెరగటంతో రైతులు లాభాల బాట పడుతున్నారు. 

ఎగుమతి దారులు, మిల్లర్ల ప్రకారం.. బాసుమతి ఎక్కువగా పండించే రాష్ట్రాలలో బాసుమతి క్వింటాల్ ధర 5 వేల రూపాయలు దాటింది. ఏడాది క్రితం 4 రూపాయలు ఉన్న ధర ఒక్కసారిగా పెరగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. 

బాసుమతి వెరైటీలు అయిన 1509, 1121 ధరలు.. హర్యానాలోని కర్నాల్, పంజాబ్ లోని ఖన్నా మార్కెట్లలో క్వింటా ధర 4 వేల 500 నుంచి 5 వేల 200 రూపాయలు పలుకుతోంది. గత ఏడాదితో పోల్చితే కనీసం వెయ్యి రూపయాలు పెరిగినట్లు చెబుతున్నారు. మన దేశంలో 75 శాతం రకాలే వాడుతున్నారు. 

యుద్ధం కారణంగా గల్ఫ్ లో ఫుల్ డిమాండ్:

గల్ఫ్ దేశాలలో డిమాండ్ కారణంగానే ఎక్కువ ధరలు పెరిగాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈలో ఎక్కవ డిమాండుంది. గల్ఫ్ లో యుద్దం కారణంగా ఈ దేశాలు ఎక్కువ శాతం నిలువలను పెంచుకునేందుకు బారీ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయని ఆలిండియా రైస్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రసిడెంట్ రంజిత్ సింగ్ జాసన్ తెలిపారు. 

2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6 మిలియన్ల 52 వేల టన్నుల బాసుమతి రైస్ ను ఎగమతి చేసింది. దీని విలువ దాదాపు 54 వేల కోట్ల రూపాయలు. 

బిర్యానీ రేట్లు పెరుగుతాయా..?

గల్ఫ్ యుద్ధాల కారణంగా గ్యాస్ రేట్లు పెరిగాయని ఇప్పటికే బిర్యానీ రేట్లు పెరిగాయి. ఇప్పటికిప్పుడు మళ్లీ రేట్లు పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పటికే ఎల్ నినో కారణంగా దిగుబడి తగ్గటం, గల్ఫ్ నుంచి బాసుమతి రైస్ కు డిమాండ్ ఇలాగే కొనసాగితే రేట్లు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.