'అర్నాబ్' తుపాను, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భారతీయ రైల్వే 50కి పైగా రైళ్లను రద్దు చేసింది. ఈ ప్రభావంతో నిత్యం వందల మంది ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ రైల్వే జంక్షన్ మంగళవారం నిర్మానుష్యంగా కనిపించింది. రైళ్ల రాకపోకలు తగ్గడంతో స్టేషన్ ప్రాంగణం దాదాపు ఖాళీగా మారింది. తుపాను కారణంగా ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు.
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లని దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి వైజాగ్, భువనేశ్వర్, కాకినాడకు వెళ్లే 10 రైళ్లు రద్దు కావడం గమనార్హం. ఫలక్నుమా, విశాఖ, గోదావరి, గరీబ్ రథ్, కోకోనడ ఎక్స్ప్రెస్, నర్సాపూర్, గౌతమి ఎక్స్ప్రెస్, నాగావలి ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు అయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
రద్దయిన పది రైళ్ల వివరాలు ఇవే..
1. Tr. నెం. 12704 సికింద్రాబాద్-హౌరా (ఫలక్నుమా ఎక్స్ప్రెస్)
2. Tr. నెం. 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ (విశాఖ ఎక్స్ప్రెస్)
3. Tr. నెం. 12728 హైదరాబాద్-విశాఖపట్నం (గోదావరి ఎక్స్ప్రెస్)
4. Tr. నెం. 12862 మహబూబ్నగర్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్
5. Tr. నెం. 12740 సికింద్రాబాద్-విశాఖపట్నం (గరీబ్ నాథ్ ఎక్స్ప్రెస్)
6. Tr. నెం. 12776 లింగంపల్లి-కాకినాడ టౌన్ (కొకనడా ఎక్స్ప్రెస్)
7. Tr. నెం. 17256 లింగంపల్లి-నరసపూర్ (నరసాపూర్ ఎక్స్ప్రెస్)
8. Tr. నెం. 12738 లింగంపల్లి-కాకినాడ పోర్ట్ (గౌతమి ఎక్స్ప్రెస్)
9. Tr. నెం. 20810 H.S.నాందేడ్-సంబల్పూర్ (నాగావళి ఎక్స్ప్రెస్)
10. Tr. నెం. 07037 చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ (స్పెషల్ ట్రైన్)
