అర్నాబ్ తుఫాన్ ఏపీని వణికిస్తోంది. నేటి (అక్టోబర్ 27, 2026) నుంచి బాపట్ల జిల్లా పరిధిలోని బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు. చీరాల, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ల దగ్గర ఆంక్షలు విధించారు. వీలైనంత వరకూ సూర్య లంక బీచ్ దగ్గరకు ఈ తుఫాను సమయంలో వెళ్లకపోవడమే బెటర్.
#WATCH | Bapatla, Andhra Pradesh: Suryalanka Beach closed to tourists for two days following warnings over Cyclone Arnab. Rough sea conditions witnessed on the shore as fishing activities remain suspended in the coastal areas. https://t.co/pylva1P1sT
— ANI (@ANI) October 27, 2026
తుఫాన్ ప్రభావంతో విద్యా సంస్థలకు ఏపీలోని పలు జిల్లాల్లో రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బీచ్ ట్రిప్పులకు ప్లాన్ చేయొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల నుంచి బీచ్లకు పర్యాటకులు రావద్దని అధికారులు సూచించారు.
అధికారిక ఉత్తర్వుల మేరకు బీచ్లలో పర్యాటకులకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో కూడా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. 'పేరుపాలెం' బీచ్ మూసివేశారు.
ALSO READ : స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం..
'నరసాపురం-సఖినేటిపల్లి' రేవుల మధ్య గోదావరిలో రాకపోకలు నిలిపివేశారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 43 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నరసాపురం కంట్రోల్ రూం నెంబర్ 08816299181. సహాయం కోసం ఈ నంబర్కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
