టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో మన ఓపెనర్లు కివీస్ బౌలర్లను ఊచకోత కోశారు. న్యూజిలాండ్ 198 పరుగులు చేయగా.. 199 టార్గెట్లో టీమిండియా బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లకు తొలి ఓవర్ నుంచే చుక్కలు చూపించారు. కివీస్ బౌలర్ జాకబ్ డఫ్ఫీ తొలి ఓవర్లో 4 వైడ్స్, ఒక నో బాల్, రెండు సిక్సులు, ఒక ఫోర్తో 26 పరుగులు ఇచ్చి భారీ మూల్యం చెల్లించుకున్నాడు.
Abhishek Sharma Half century Replay 💥✨ #INDvsNZ https://t.co/NN47CMazZP
— Cricket Blaze (@CricketBlaze45) October 27, 2026
రెండో ఓవర్లో 17 పరుగులు, మూడో ఓవర్లో 21 పరుగులు, నాలుగో ఓవర్లో 20 పరుగులు, ఐదో ఓవర్లో 16 పరుగులు.. ఇలా ఐదు ఓవర్లలోనే టీమిండియా స్కోర్ 100 పరుగుల మైలు రాయిని చేరుకుంది. అభిషేక్ శర్మ అయితే పూనకం వచ్చినట్టుగా కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 15 బంతుల్లో 50 రన్స్ చేసి సిక్సులు, ఫోర్లతో అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
ALSO READ : 15 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీ..
వైభవ్ సూర్య వంశీ కూడా 19 బంతుల్లో 4 సిక్సులు, 4 ఫోర్లతో 45 పరుగులు చేసి క్యా్చ్ ఔట్గా వెనుదిరిగాడు. అప్పటికే ఈ ఇద్దరు ఓపెనర్లు న్యూజిలాండ్ గెలుపు ఆశలను సమాధి చేశారు. 5 టీ20 సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచులను గెలిచి సత్తా చాటిన టీమిండియా మూడో మ్యాచ్ను కూడా దాదాపు గెలిచేసి సిరీస్ను కైవసం చేసుకునే దిశగా దూసుకెళుతోంది.
Maximum from Abhishek 💥 #INDvsNZ https://t.co/kIE2mVgNjd
— Cricket Blaze (@CricketBlaze45) October 27, 2026
