పిచ్చ కొట్టుడు కొట్టిన అభిషేక్, వైభవ్.. న్యూజిలాండ్‌పై ఘన విజయం.. సిరీస్ గెలిచిన భారత్

పిచ్చ కొట్టుడు కొట్టిన అభిషేక్, వైభవ్.. న్యూజిలాండ్‌పై ఘన విజయం.. సిరీస్ గెలిచిన భారత్

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 (3rd T20I) మ్యాచ్‌లో భారత జట్టు విధ్వంసకర బ్యాటింగ్‌తో విశ్వరూపం చూపించింది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. కివీస్ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ కేవలం 13.2 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మైండ్-బ్లోయింగ్ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3–0 తేడాతో సొంతం చేసుకుంది.

అభిషేక్ శర్మ 'సునామీ' సెంచరీ: 

199 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 38 బంతుల్లోనే 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 113 రన్స్ బాది మైదానాన్ని హోరెత్తించాడు. దీంతో గ్రౌండ్ నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపిస్తూ టీ20 క్రికెట్‌లో సరికొత్త శకానికి నాంది పలికాడు.

15 ఏళ్ల వండర్ కిడ్ వీరవిహారం: 

అభిషేక్‌ శర్మకు తోడుగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కూడా పవర్-ప్యాక్డ్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు సాధించి పవర్‌ప్లేలోనే న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇద్దరు ఓపెనర్లు కేవలం 14 బంతుల్లోనే (2.2 ఓవర్లలో) జట్టు స్కోరును 50 దాటించి ఆల్-టైమ్ టీ20ఐ వరల్డ్ రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

చేతులెత్తేసిన కివీస్ బౌలర్లు: 

198 పరుగులు చేసి విజయంపై ధీమాగా ఉన్న న్యూజిలాండ్ బౌలర్లకు టీమిండియా బ్యాటర్ల ధాటికి ఏం చేయాలో పాలుపోలేదు. కైల్ జేమీసన్ 2 వికెట్లు, మ్యాథ్యూ ఫిషర్, మిచెల్ శాంట్నర్ తలో వికెట్ పడగొట్టినప్పటికీ.. భారత బ్యాటర్లు 13.2 ఓవర్లలోనే 199/4 స్కోరుతో మ్యాచ్‌ను ముగించారు.

డారిల్ మిచెల్ ధనాధన్ బ్యాటింగ్: 

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించింది. ఇక కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ (Daryl Mitchell) భారత బౌలర్లను మైదానం నాలు వైపులా బాదుతూ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో మిచెల్ కేవలం 44 బంతుల్లోనే 89 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.