రామ్ లీలా మైదాన్ లో కాంగ్రెస్ భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ ర్యాలీలో పాల్గొననుంది. వోట్ బచావో, దేశ్ బచావో పేరుతో నవంబర్ 1న నిర్వహించనున్న ఈ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతిచ్చినట్లే ఇచ్చి కఠిన షరతులు విధించారు పోలీసులు. పోలీసులు విధించిన షరతుల మధ్య ర్యాలీని సాయంత్రం 5 గంటలలోపు ముగించాలని,రెచ్చగొట్టే ప్రసంగాలపై నిషేధం ఉంటుందని తెలిపారు పోలీసులు.
పోలీసులు విధించిన షరతుల మధ్య ఉదయం 10 గంటల నుంచి 5 గంటల లోపు ర్యాలీ ముగించాలని తెలిపారు పోలీసులు. సమావేశం శాంతియుతంగా జరిగేలా, ఎలాంటి హింస, ప్రజాశాంతికి భంగం, కలగకుండా చూసుకోవాలని పోలీసులు ఆదేశించారు. ర్యాలీ సాయంత్రం 5 గంటలలోపు ముగించాలని.. ఆ తర్వాత స్వచ్చందంగా అక్కడి నుంచి అందరు వెళ్లిపోయావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించడానికి వీలు లేదని స్పష్టం చేశారు పోలీసులు.
ర్యాలీకి ముందు గానీ, తర్వాత గానీ పాల్గొనేవారు రామ్‌లీలా మైదాన్‌లో రాత్రి బస చేయడాన్ని కూడా నిషేధించారు పోలీసులు. ఈ నిబంధనలను ఉల్లంఘించినా, పోలీసుల ఆదేశాలను పాటించడంలో విఫలమైనా, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ర్యాలీకి ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు పోలీసులు.
పోలీసుల షరతులు ఇవే:
సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ముగియాలి:
నవంబర్ 1, 2026న జరగాల్సిన ర్యాలీ సాయంత్రం 5 గంటలకు కచ్చితంగా ముగియాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమ సమయాన్ని పొడిగించడం జరగదు.
రాత్రి బసకు అనుమతి లేదు:
ర్యాలీకి ముందు గానీ, తర్వాత గానీ, పాల్గొనేవారు రామ్‌లీలా మైదాన్‌లో రాత్రి బస చేయడానికి అనుమతి లేదు.
సీసీటీవీ ద్వారా నిఘా:
ఎంట్రన్స్ ఎగ్జిట్ గేట్ దగ్గర, వేదిక దగ్గర, పరిసర ప్రాంతంలో హై డెఫినిషన్ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని తెలిపారు. రికార్డింగ్, కనీసం ఐదు మానిటర్లతో కూడిన ఒక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నీటి సరఫరా, టాయిలెట్స్ ఏర్పాటు:
ర్యాలీకి హాజరయ్యే వారికి తగినన్ని నీటి ట్యాంకర్లు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలని... మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల సముదాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు పోలీసులు.
వాలంటీర్లను నియమించాలి:
ర్యాలీ సాఫీగా సాగేందుకు తగినంత మంది వాలంటీర్లను నియమించుకోవాలని.. వాలంటీర్లకు యూనిఫామ్,బ్యాడ్జీలు ఇవ్వాలని ఆదేశించారు పోలీసులు.
కులం, మతం గురించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయద్దు:
కులం, మతం, వర్ణం ఆధారంగా ఉద్రిక్తతను రెచ్చగొట్టే, దెబ్బతీసే ఎలాంటి ప్రసంగాలనూ వేదికపై అనుమతించొద్దని తెలిపారు.
నిర్దేశిత ప్రాంతాలలో వాహనాల పార్కింగ్:
ర్యాలీకి వచ్చే బస్సులు, కార్లు, టెంపోలు, ఇతర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు నిర్దేశించిన ప్రాంతాలలో మాత్రమే పార్క్ చేయాలి.
