ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గొడ్డలి పార్టీ సహించలేకపోతుందని.. ఆ పార్టీది తీవ్రవాదుల్లా హిట్ అండ్ రన్ విధానమని వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. మంగళవారం ( అక్టోబర్ 27 ) సీఎం క్యాంపు ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షడు మాధవ్ లతో సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకోవటం ద్వారా రాష్ట్రాభివృద్ధిని నిరోధించటమే ఆ పార్టీ వైఖరి అని... స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి చెడులను విశ్లేషించి ఓటు వేయాలని... గడచిన రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గత పాలకులు విధ్వంసంతోనే పాలన చేశారని... కూటమిగా ఏర్పడి గత ప్రజా కంటక పాలనను అంతమొందించామని అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు మాకు అప్పగించారని... ఎల్ నినో కరువు పరిస్థితుల్లోనూ ఎక్కడా అభివృద్ధి ఆగిపోకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు అర్నబ్ తుఫాను లాంటి ప్రకృతి విపత్తు వచ్చిందని... సమర్ధంగా ఎదుర్కోనేలా యంత్రాంగాన్ని సిద్ధం చేశామని అన్నారు.
