IPL 2027: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ తమ సపోర్ట్ స్టాఫ్‌ను పూర్తిగా మార్చేస్తోంది. ఇటీవల న్యూ హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను (Zaheer Khan) నియమించిన సీఎస్కే, తాజాగా ముగ్గురు మాజీ క్రీడాకారులను అసిస్టెంట్ కోచ్‌లుగా నియమించుకున్నట్లు ప్రకటించింది. చెన్నై మాజీ స్టార్ ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్ (Albie Morkel), భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ (Mohit Sharma), ఇంగ్లాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ గారెత్ బాటీ (Gareth Batty) లు జహీర్ ఖాన్ నేతృత్వంలో సీఎస్కే అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.
10 ఏళ్లు పని చేసిన సపోర్ట్ స్టాఫ్‌కు వీడ్కోలు:
* సుదీర్ఘకాలం (16 ఏళ్లు) హెడ్ కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంగ్లాండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో, చెన్నై సూపర్ కింగ్స్ తమ కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది.
* నిష్క్రమించిన సీనియర్లు: బాటింగ్ కోచ్ మైక్ హస్సీ, బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్, స్ట్రెంత్ & కండిషనింగ్ కోచ్ గ్రెగ్ కింగ్, ఫిజియో టామీ సిమ్సెక్ సీఎస్కే ఫ్రాంచైజీ నుంచి తప్పుకున్నారు.
* కొనసాగుతున్న కోచ్‌లు: అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్, ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫోస్టర్లు మాత్రం తమ స్థానాల్లోనే కొనసాగనున్నారు.
ALSO READ : 12 బంతుల్లో ఫిఫ్టీ కొట్టడం నీ వల్ల కాదులే అభిషేక్..
మోర్కెల్, మోహిత్ శర్మలకు సీఎస్కేతో ప్రత్యేకానుబంధం:
* ఆల్బీ మోర్కెల్: 2008 ఆరంభ సీజన్ నుంచి 2013 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున 78 మ్యాచ్‌ల్లో ఆడి 827 పరుగులు, 76 వికెట్లు తీసి జట్టు సాధించిన తొలి టైటిళ్లలో ప్రధాన పాత్ర పోషించాడు.
The lion behind some of Chepauk's most unforgettable moments is ready for a new innings! 💛 An OG Super King from 2008, a key member of our back-to-back IPL triumphs in 2010 and 2011! Albie Morkel's story with the Super Kings continues! Welcome aboard, Albie! 🦁 #WhistlePodu #Yellove
— Chennai Super Kings (@ChennaiIPL) October 27, 2026
* మోహిత్ శర్మ: 2013 నుంచి 2019 వరకు సీఎస్కే తరఫున 48 మ్యాచ్‌ల్లో 58 వికెట్లు పడగొట్టాడు. 2025 డిసెంబర్‌లో అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మోహిత్, ఇప్పుడు సూపర్ కింగ్స్ కోచింగ్ ప్యానెల్‌లోకి అడుగు పెడుతున్నాడు.
Once a Super King. Now ready to shape the next generation! 💛 From his IPL debut in Yellow in 2013 to winning the Purple Cap in 2014, Mohit Sharma has given us plenty of reasons to whistle with his masterful slower deliveries and variations! Welcome home, Mohit! 🦁 #WhistlePodu #Yellove
— Chennai Super Kings (@ChennaiIPL) October 27, 2026
* గారెత్ బాటీ: సూర్రే కౌంటీ జట్టును వరుసగా మూడు కౌంటీ ఛాంపియన్‌షిప్ టైటిళ్లకు నడిపించిన అత్యంత అనుభవజ్ఞుడైన కోచ్‌గా గుర్తింపు పొందాడు గారెత్ బాటీ.
Three consecutive County Championship titles. A proven leader! 💛 Former England international Gareth Batty brings his wealth of experience, tactical expertise, and passion for developing talent to the Super Kings! Welcome to the Den, Gareth Batty! 🦁 #WhistlePodu #Yellove https://t.co/FCFPJWYiv5
— Chennai Super Kings (@ChennaiIPL) October 27, 2026
