బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటిన అర్నబ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ( అక్టోబర్ 28 ) తెల్లవారుజామున తుఫాను తీరం దాటిన సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన రాకాసి గాలులు తీరా ప్రాంతాలను వణికించాయి. రాబోయే 48 గంటల్లో తుఫాను బలహీనపడి అవకాశం ఉందని.. మరో 6 గంటల్లో తుఫాను తీవ్ర రూపం దాల్చుతుందని తెలిపింది వాతావరణ శాఖ.
ఈ క్రమంలో కోస్తా జిల్లాలకు వరద ముప్పు ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. కాకినాడ, కోనసీమ, ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలెర్ట్ జారీ చేసింది. నదీపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మరో 24 గంటల పాటు వరద హెచ్చరికలు కొనసాగుతాయని తెలిపింది వాతావరణ శాఖ.
రానున్న మూడు రోజుల పాటు కోస్తా, యానాంలో వాతావరణం:
ఇవాళ చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
అక్టోబర్ 29న చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని..కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
అక్టోబర్ 30న చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
రాయలసీమలో..
రాయలసీమలో ఇవాళ, రేపు ( అక్టోబర్ 28,29 ) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
అక్టోబర్ 30న పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ALSO READ : కృష్ణా జిల్లాలో తుపాను బీభత్సం.. భారీ వర్షానికి విరిగిపడ్డ చెట్లు, హోర్డింగులు
భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లోద్దని సూచించింది వాతావరణ శాఖ. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లడంపై నిషేధం ఉన్న క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లోద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ.
