నితేష్ తివారీ దర్శకత్వం వహించిన రామాయణం మొదటి భాగం.. 'రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' సినిమా ఇంగ్లీష్ వెర్షన్ ప్రీమియర్ షోను లాస్ ఏంజిల్స్‌లో ప్రదర్శించారు. హాలీవుడ్ సినీ ప్రముఖులు, సినీ విశ్లేషకులు ఈ ప్రీమియర్ షోకు హాజరయ్యారు.
First reaction on Ramayana is out 💥 #Ramayana https://t.co/4d6gBOd5ws
— Lucif3r. (@Luci_twtz) October 28, 2026
ఈ సినిమా ప్రీమియర్ షో రివ్యూలను బయటపెట్టకూడదని ఆంక్షలు విధించినప్పటికీ ఒకరిద్దరు సమీక్షకులు మాత్రం సోషల్ మీడియాలో సినిమా చూసొచ్చాక తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక హాలీవుడ్ క్రిటిక్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. 2001లో ‘ది లార్డ్ ఆఫ్ రింగ్స్’ సినిమా చూశానని.. అప్పటి నుంచి ఈ సినిమా చూశాకే మరోసారి అలాంటి అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించానని చెప్పారు.
సినిమా ప్రపంచంలో తాను ఇప్పుడే చూసిన లాంటిది మరొకటి లేదని, ఈ సినిమా అరేబియన్ నైట్స్ తరహాలో, ఒక అద్భుత కథ నిజరూపం దాల్చినట్లుగా ఉందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే.. ఒకరిద్దరి అభిప్రాయాన్ని ప్రేక్షకుల అభిప్రాయంగా భావించలేనప్పటికీ.. రామాయణ పార్ట్-1పై ఈ క్రిటిక్ పాజిటివ్ టాక్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవంబర్ 5న రామాయణ పార్ట్--1 సినిమాకు ప్రేక్షకుల నుంచి అసలైన టాక్ బయటకొస్తుంది.
ALSO READ : కుటుంబాన్ని కాపాడేందుకు సామాన్యుడు తెగిస్తే..
ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రధాన తారాగణం అయిన రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ కూడా లాస్ ఏంజిల్స్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో రెడ్ కార్పెట్‌పై ఈ సినిమా టీం మెరిసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా కూడా అక్టోబర్ 28, 2026, బుధవారం ఉదయం 7 గంటలకు (IST) లాస్ ఏంజిల్స్లో ప్రదర్శించిన 'రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' గ్రాండ్ ప్రీమియర్‌కు హాజరు కావడం గమనార్హం.
