జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓ సరికొత్త చరిత్ర సృష్టిస్తూ దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టింది. అక్టోబర్ 28న స్టాక్ మార్కెట్లలో భారీ ప్రీమియంతో లిస్ట్ అయిన అంబానీ సంస్థ దేశంలోనే 2వ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. షేర్ ఇష్యూ ధర రూ.1,119 కాగా.. లిస్టింగ్ సమయంలో ఏకంగా 21.4% ప్రీమియంతో ఒక్కో షేరు రూ.1,358 రేటు వద్ద లిస్ట్ అయ్యాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12లక్షల 60వేల కోట్లకు చేరింది.
ఈ బ్లాక్‌బస్టర్ లిస్టింగ్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. అలాగే భారతి ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి దేశంలోనే నంబర్ వన్ టెలికాం కంపెనీగా జియో రికార్డు సృష్టించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో అంబానీ కుటుంబం ఘనంగా స్టాక్ లిస్టింగ్ సెలబ్రేట్ చేసుకుంది. ఇన్వెస్టర్లకు ఈ లిస్టింగ్ కాసుల వర్షం కురిపించింది. షేర్ హోల్డర్ కేటగిరీలో కనీసం 23 షేర్ల లాట్ కొన్న ఇన్వెస్టర్లకు ఒక్క రోజులోనే రూ.5వేల 497 మేర లాభం దక్కింది.
జియో ఐపీఓ సంచలన రికార్డులు సృష్టించిందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. కేవలం 95 నిమిషాల్లోనే కంపెనీ ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిందని, భారత్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన రికార్డు అని పేర్కొన్నారు. మొత్తం రూ.7లక్షల 50వేల కోట్లకు పైగా డిమాండ్‌తో కోటి 30లక్షలకు పైగా దరఖాస్తులు అందడంతో తమ అంచనాలను మించిపోయిందని తెలిపారు. క్యూఐబీ కేటగిరీలో బిడ్లు ఏకంగా 70.55 రెట్లు వచ్చాయన్నారు. దేశ ప్రజలు తమ కంపెనీపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి ఇది నిదర్శనమని అంబానీ ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేసింది.
అయితే ఇది ముగింపు కాదని, కొత్త వాటాదారుల పట్ల తమ బాధ్యతకు ఇదొక అద్భుతమైన ఆరంభమని ఆకాష్ అంబానీ స్పష్టం చేశారు. డిజిటల్ రంగంలో సరికొత్త శకానికి ఈ లిస్టింగ్ నాంది పలికిందన్నారు. దేశ ప్రజలు తమ కంపెనీపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి ఇది నిదర్శనమని అంబానీ ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేసింది.
