మా కూతురు పెళ్లికి రండి: మంత్రి సీతక్కకు షర్మిల దంపతుల ఆహ్వానం

మా కూతురు పెళ్లికి రండి: మంత్రి సీతక్కకు షర్మిల దంపతుల ఆహ్వానం

ప్రజా భవన్ లో మంత్రి సీతక్కను కలిసి తన కూతురి వివాహానికి ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ చీఫ్ వైయస్ షర్మిల. 2026 అక్టోబర్ 28న ఆహ్వాన పత్రికను మంత్రి సీతక్క కు అందజేసి, కూతురు వివాహానికి ఆహ్వానించారు.

 తన నివాసానికి విచ్చేసిన షర్మిల దంపతులను శాలువా కప్పి ఆత్మీయంగా ఆహ్వానించారు మంత్రి సీతక్క.  వైయస్ రాజశేఖర్ రెడ్డి తో షర్మిల ఉన్న చిత్రపటాన్ని షర్మిలకు బహూకరించారు మంత్రి. ఈ సమయంలో మంత్రి సీతక్క వెంట తనయుడు సూర్య, ములుగు డీసీసీ పైడాకుల అశోక్ ఉన్నారు.