12 బంతుల్లో ఫిఫ్టీ చేయాలన్న యువరాజ్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన అభిషేక్ శర్మ

12 బంతుల్లో ఫిఫ్టీ చేయాలన్న యువరాజ్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన అభిషేక్ శర్మ

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో కేవలం 38 బంతుల్లో 113 పరుగులు చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ఈ విధ్వంసకర శతకం అనంతరం తన గురువు, భారత మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తనదైన శైలిలో అభిషేక్‌ను సరదాగా ఆటపట్టించగా.. తాజాగా అభిషేక్ దీనికి నవ్వులు పూయించేలా అదిరిపోయే రిప్లై ఇచ్చాడు!

నువ్వు ఇంకా 12 బంతుల్లో ఫిఫ్టీ కొట్టలేదు: యువీ

కివీస్‌పై అభిషేక్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే యువరాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నువ్వు ఎంత కొట్టినా ఇంకా 12 బంతుల్లో 50 రన్స్ (50 off 12) మాత్రం సాధించలేకపోయావు అభిషేక్ శర్మ! అంటూ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో తాను సాధించిన ఆల్-టైమ్ వరల్డ్ రికార్డును గుర్తుచూస్తూ సరదాగా యువరాజ్ ట్రోల్ చేశాడు.

అభిషేక్ శర్మ ఫన్నీ రిప్లై: 

యువరాజ్ చేసిన ఈ కామెంట్‌పై మ్యాచ్ అనంతరం స్పందించిన అభిషేక్ శర్మ నవ్వుతూ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. యువీ పా (Yuvraj Singh) ఆ రోజుల్లో ఎలా బ్యాటింగ్ చేసేవాడో నాకు సరిగ్గా తెలియదు కానీ.. కేవలం 12 బంతుల్లో 50 రన్స్ చేయడం మాత్రం అంత ఈజీ కాదన్నాడు. ఏ బ్యాటర్ అయినా అలా ఆడటం చాలా గొప్ప విషయం. అప్పుడప్పుడు మాత్రమే మైదానంలో అలాంటి అద్భుతాలు జరుగుతుంటాయని చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత రికార్డుల కంటే మైదానంలో జట్టును గెలిపించడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా అభిషేక్ స్పష్టం చేశాడు. గురు-శిష్యుల మధ్య కొనసాగిన ఈ ఫన్నీ డిస్కషన్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తెగ ట్రెండ్ అవుతోంది.