WPL 2027 Auction: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2027) ఐదవ సీజన్‌కు సమయం ఆసన్నమైంది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7, 2027 వరకు జరగనున్న ఈ పొట్టి ఫార్మాట్ మహా సంగ్రామానికి ముందే.. ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఐదు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. కొచ్చిలోని గ్రాండ్ హయత్ వేదికగా ఈరోజు (2026, అక్టోబర్ 28, బుధవారం ) సాయంత్రం డబ్ల్యూపీఎల్ 2027 మినీ ఆక్షన్ (WPL Mini Auction) ఘనంగా ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 146 మంది ప్లేయర్లు (119 మంది భారతీయులు, 27 మంది విదేశీయులు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, ఐదు ఫ్రాంచైజీల దగ్గర కేవలం 27 ఖాళీ స్లాట్లు (20 భారతీయులు, 7 విదేశీయులు) మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
వేలంలో హాట్ కేకులుగా మారనున్న స్టార్ ప్లేయర్లు:
* రూ. 50 లక్షల అత్యధిక బేస్ ప్రైస్ బ్రాకెట్‌లో బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్ స్టార్ సోఫీ డన్క్లీ (Sophia Dunkley), ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినెక్స్ (Sophie Molineux) ల కోసం ఫ్రాంచైజీలు గట్టిగా పోటీపడే అవకాశం ఉంది.
* భారత స్టార్లలో డిమాండ్: వికెట్ కీపర్ బ్యాటర్ జి. కమలిని, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా, తేజల్ హసబ్నిస్, ఆశా శోభన, కిరణ్ నవ్‌గిరేలకు భారీ ధర దక్కే అవకాశం కనిపిస్తోంది.
* 16 ఏళ్ల వండర్ కిడ్ ఇరా యాదవ్: మేఘాలయపై అండర్-19 వన్డే టోర్నీలో కేవలం 157 బంతుల్లోనే 346 పరుగులు బాదిన 16 ఏళ్ల ముంబై కుర్రాది ఇరా యాదవ్ (Ira Jadhav) అన్‌క్యాప్డ్ విభాగంలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా మారేందుకు సిద్ధంగా ఉంది.
* యువ, సీనియర్ ఆటగాళ్లు: 15 ఏళ్ల కాష్వి, అంశు నాగర్‌లు ఈ వేలంలో అత్యంత పిన్న వయస్కులు కాగా, 36 ఏళ్ల శ్రీలంక కెప్టెన్ చమరి అతపత్తు అత్యంత సీనియర్ ప్లేయర్‌గా నిలిచింది.
ఐదు జట్ల వద్ద మిగిలిన పర్స్
టీమ్ మిగిలిన పర్స్ (రూ.) ఖాళీ స్లాట్స్ ఓవర్సీస్ స్లాట్స్
యుపీ వారియర్స్ రూ. 3.65 కోట్లు 7 2
గుజరాత్ జెయింట్స్ రూ. 1.25 కోట్లు 3 1
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.1.15 కోట్లు 5 2
ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10 కోట్లు 5 1
ముంబై ఇండియన్స్ రూ.1.00 కోటి 7 1
లైవ్ టెలికాస్ట్ మరియు స్ట్రీమింగ్ వివరాలు:
* సమయం: ఈరోజు (బుధవారం) సాయంత్రం 5:30 PM IST (ఆక్షన్ ప్రీ-ఈవెంట్ 4:30 PMకి ప్రారంభం).
* లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports Network).
* లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్ (Jio Hotstar) యాప్, వెబ్‌సైట్.
