రైలు బోగీల్లో మొబైల్ ఫోన్ల ఛార్జింగ్ వినియోగంపై భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రైళ్లలో మొబైల్ ఛార్జింగ్‌ను రైల్వే శాఖ నిషేధించింది. అక్టోబర్ 24న ఆగ్నేయ రైల్వే పరిధిలో నడిచే ముంబై-హౌరా మెయిల్లోని ఒక ఏసీ కోచ్‌లో రాత్రంతా ఛార్జింగ్ చేస్తుండగా ఒక ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలిపోయింది. ఈ ఘటనతో రైల్వే అప్రమత్తం అయింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు.. నిర్దేశించిన ఆరు గంటల వ్యవధిలో కోచ్‌లలోని మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను స్విచ్ ఆఫ్ చేయాలని రైల్వే ఆదేశించింది.
ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణికులు నిద్రపోతూ అలానే ఛార్జింగ్ పెట్టి పడుకుంటున్నారు. ఈ క్రమంలో ఫోన్ వేడెక్కడం, పొగ లేదా విద్యుత్ లేదా బ్యాటరీ సంబంధిత సమస్యలకు కారణమవుతున్న ఘటనలు రైల్వేలో ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. అందువల్ల.. రాత్రిపూట ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడం మంచిది కాదని.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రైళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువలకు ఛార్జింగ్ పెట్టడంపై రైల్వే శాఖ నిషేధం విధించింది.
ALSO READ : రాళ్లు విసిరినా.. రాడ్లతో కొట్టినా పగలని గ్లాస్
పవర్ బ్యాంక్‌లలో రీఛార్జ్ చేయగల లిథియం-అయాన్ లేదా లిథియం-పాలిమర్ బ్యాటరీలు ఉంటాయి. ఒకవేళ బ్యాటరీ దెబ్బతిన్నా, ఓవర్ హీట్ అయినా లేదా ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్‌కు లోనైనా, అది థర్మల్ రన్‌వే స్థితిలోకి వెళుతుంది. దీనివల్ల హీట్ స్పీడ్‌గా పెరగడం, పొగ, మంటలు.. కొన్ని పరిస్థితులలో పేలుడు సంభవించవచ్చు. అందువల్ల.. రైళ్లలో పవర్ బ్యాంక్స్ కు ఛార్జింగ్ పెట్టడం కంటే.. పవర్ బ్యాంక్స్ కు ఇంటి దగ్గరే ఛార్జింగ్ పెట్టుకుని రైలు ప్రయాణాల సమయంలో పవర్ బ్యాంక్‌తో మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టుకోవడం ఉత్తమం.
