కేరళలో జడ్జి కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలురావడంతో కొచ్చి పోలీస్ కమిషనర్ పై వేటు పడింది.కొచ్చి సీపీ కళిరాజ్ మహేష్ కుమార్ ను బదిలి చేశారు. దర్యాప్తులో సరిగా నిర్వహించలేదని , లోపాలున్నాయని కేరళ హోంమంత్రి రమేష్ ఒప్పుకొని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. . ఆయన స్థానంలో నిశాంతినిని నూతన పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
నిందితుడు జడ్జి కుమారుడు కావడంతో పోలీసులు నిందితుడికి అనుకూలంగా వ్యవహరించారని, కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రాథమిక దర్యాప్తులో లోపాలున్నాయని కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితాల అసెంబ్లీలో అంగీకరించిన వెంటనే.. కమిషనర్ కలిరాజ్ మహేష్ కుమార్‌ను బదిలీ చేయడంతో పాటు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా నలుగురు పోలీసు సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
మొదట నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మృతికి కారణం అవడం కింద సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేసి నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అయితే బాధితుడి కుటుంబం, స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు నిరసనలు తెలపడంతో ఈ కేసును హత్యకు సమానమైన నేరంగా కేసు నమోదు చేశారు.
కారు రిజిస్ట్రేషన్ జడ్జి పేరిట ఉండటంతో పాటు, మైనర్‌కు కారు ఇచ్చినందుకు మోటారు వాహనాల చట్టం సెక్షన్ 199A కింద సదరు అడిషనల్ జిల్లా జడ్జిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై తదుపరి చర్యల కోసం పోలీసులు కేరళ హైకోర్టుకు రిపోర్టు సమర్పించారు. ఈ కేసులో ఓ జడ్జి కుమారుడు కావడం, మైనర్ కావడంతో కేసు తప్పుదో వ పట్టించే ప్రయత్నాలు జరిగాయని బాధితుడి కుటుంబం ఆరోపించింది. ఈ కేసులో మైనర్ నేరాలకు సంరక్షకుడు బాధ్యత వహించాల్సి ఉండగా.. జడ్జి విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ : అదృష్టం అంటే నీదే భయ్యా !
అక్టోబర్ 25న కేరళలోని కొచ్చి సిటీలో మెర్సిడెజ్ బెంజ్ కారు స్కూటర్ ను ఢీకొట్టడంతోఒ 55 ఏళ్ల జయబాలకృష్ణన్ అనే చిరు వ్యాపారి మృతిచెందారు. అయితే ఈకేసును పక్కదారి పట్టించేందుకు కుట్ర జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితుడు అరెస్ట్ రెండు గంటల్లో విడుదల చేశారని , కేసు కొనసాగుతుండగానే మరోసారి అదుపులోకి తీసుకుని విడుదల చేశారని, పోలీసుల తీరుపై నిరసనలు, జవాబుదారీతనంపై అనేక ప్రశ్నలకు లేవనెత్తింది.
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో కేరళ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది. దర్యాప్తులో లోపాలు ఉన్నాయని హోంమంత్రి అంగీకరించడంతో కొచ్చి పోలీస్ కమిషనర్‌ను బదిలీ చేయడం, నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు.మరోవైపు, నిందితుడికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై బాధితుడి కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. ఈ కేసులో జడ్జి పాత్ర, మైనర్‌కు కారు ఇచ్చిన వ్యవహారం, పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తదుపరి చర్యలు కీలకం కానున్నాయి.
