కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో మాస్ ఎంటర్టైన్మెంట్ అందించిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్.. ఇప్పుడు అజిత్‌తో 'డేర్ డెవిల్' అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే లేటెస్ట్ గాఈ సినిమా చుట్టూ హీరోయిన్ మార్పు రూమర్లు హాట్ టాపిక్‌గా మారాయి. మొదట శ్రీలీలను కథానాయికగా తీసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఆమె స్థానంలో కయాదు లోహర్‌ను ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
హీరోయిన్ విషయంలో సస్పెన్స్..
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు హీరోయిన్ మార్పుపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ మూవీలో శ్రీలీల, ప్రభు, పార్తిబన్, సునీల్ ఈ చిత్రంలో భాగం కానున్నారని ఇటీవల అధిక్ రవిచంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో 'డేర్ డెవిల్' లో శ్రీలీల కొనసాగుతున్నారనే చర్చకు బలం చేకూరింది. కయాదు లోహర్ పేరు మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఖరారు కాలేదు. ఇప్పుడు వినిపిస్తున్నఈ హీరోయిన్ సస్పెన్స్‌కు తెరపడాలంటే చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సిందే.
మూడు ప్రాంతాల్లో షూటింగ్..
'డేర్ డెవిల్' షూటింగ్‌ను నవంబర్ 12 నుంచి ప్రారంభించేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, మలేషియా, బ్యాంకాక్‌లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. చెన్నైలో వర్షాల అనిశ్చితి కారణంగా ఇండియాలో చిత్రీకరించాల్సిన భాగాలకు హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు అధిక్ తెలిపారు. విదేశీ లొకేషన్లు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా విజువల్‌గా కూడా ఆకట్టుకునే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
నిర్మాతగా షాలిని ఎంట్రీ...
ఈ సినిమాకు 'డేర్ డెవిల్' అనే టైటిల్‌ను అజిత్ స్వయంగా సూచించినట్లు అధిక్ వెల్లడించారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో పోలిస్తే, ఈసారి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వినోదాత్మక చిత్రాన్ని అందించడమే లక్ష్యమని దర్శకుడు పేర్కొన్నారు. మరో ప్రత్యేకత ఏమిటంటే.. షాలిని అజిత్‌కుమార్ 'బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆమెకు ఇది కీలకమైన ఆరంభం కానుంది. అనిరుధ్ సంగీతం అందించనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే శ్రీలీల–కయాదు లోహర్ వివాదానికి చిత్రబృందం ఎప్పుడు ఫుల్స్టాప్ పెడుతుందో చూడాలి..
