హైదరాబాద్లోని మణికొండలో విషాదం

హైదరాబాద్లోని మణికొండలో విషాదం

హైదరాబాద్: హైదరాబాద్లోని మణికొండలో ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలోని స్పెక్ట్రమ్ ఐవీ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన జరిగింది. కోకాపేట ఎక్సలెన్సియా కాలేజీలో జి. హేమంత్ శ్రీ సాయి(17) అనే విద్యార్థి ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు.

హేమంత్ కుటుంబం ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తు పై నుంచి కింద పడి హేమంత్ శ్రీ సాయి చనిపోయాడు. బుధవారం ఉదయం విద్యార్థి తల్లి శ్రీదేవి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీసులు సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.