అర్నబ్ తుఫాన్ తీరం దాటింది. ప్రస్తుతం బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతుంది. రాబోయే 48 గంటల్లో ఈ తుఫాను ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. రాబోయే 6 గంటల్లో తుఫాను మరింత బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుతం తుఫాను కేంద్ర ప్రాంతం పూర్తిగా భూభాగంలోకి ప్రవేశించడంతో భూభాగాన్ని దాటే ప్రక్రియ పూర్తయింది.
* ప్రస్తుతం-నర్సాపూర్ (ఆంధ్రప్రదేశ్) కు తూర్పు-ఈశాన్యంగా సుమారు 20 కి.మీ. దూరంలో,
* యానాం (పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం) కు నైరుతిగా సుమారు 40 కి.మీ. దూరంలో,
* కాకినాడ (ఆంధ్రప్రదేశ్) కు నైరుతిగా సుమారు 60 కి.మీ. దూరంలో,
* మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్) కు తూర్పు-ఈశాన్యంగా సుమారు 90 కి.మీ. దూరంలో,
* గన్నవరం (ఆంధ్రప్రదేశ్) కు తూర్పుగా సుమారు 120 కి.మీ. దూరంలో,
* తునికి నైరుతిగా సుమారు 120 కి.మీ. దూరంలో ఉంది.
ఈ అర్నబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఈరోజు ఒక్కరోజు ఉండే అవకాశం ఉంది. ఈరోజు (అక్టోబర్ 28, 2026) నాలుగు జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి ,ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు 5 జిల్లాల్లో కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
మిగిలిన అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఈదురు గాలుల తీవ్రత అత్యధికంగా కనిపించే అవకాశం ఉందని.. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు అక్కడక్కడ 70 నుంచి 80కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
