మీ బాల్కనీని అందమైన సీతాకోకచిలుకల తోటగా మార్చుకోవాలనుకుంటున్నారా? కేవలం కుండీల్లో మొక్కలు పెడితే సరిపోదు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే రంగురంగుల సీతాకోకచిలుకలు మీ బాల్కనీకి క్యూ కడతాయి!
ప్రకాశవంతమైన పెయింటింగ్స్:
గోడలు, పూల కుండీలపై ఎరుపు, పసుపు, గులాబీ, పర్పుల్ కలర్ పువ్వులను పెయింట్ చేయండి. ఈ ముదురు రంగులను చూసి సీతాకోకచిలుకలు నిజమైన పువ్వులనుకుని ఆకర్షితులవుతాయి.
సీతాకోకచిలుకల బొమ్మలు:
పూల కుండీలపై లేదా గోడలపై సీతాకోకచిలుకల డిజైన్లు వేయడం వల్ల, ఆ ప్రదేశం వాటికీ సురక్షితమైనదని భావించి నిజమైన సీతాకోకచిలుకలు అక్కడికి వస్తాయి.
రంగురంగుల కుండీలు, రాళ్లు:
పూల కుండీలకు, అలంకరణ రాళ్లకు బ్రైట్ కలర్స్ వేస్తే బాల్కనీ చూడటానికి అందంగా కనిపించడమే కాకుండా సీతాకోకచిలుకలను వెంటనే ఆకట్టుకుంటుంది.
నీటి ఏర్పాటు (బర్డ్ బాత్):
సీతాకోకచిలుకలకు నీరు చాలా అవసరం. బాల్కనీలో ఒక చిన్న పక్షుల స్నానపు తొట్టి (బర్డ్ బాత్) పెట్టండి. లేదా గోడలకు లేత నీలం రంగు పెయింట్ వేసి నీరు ఉన్నట్లు కనిపించేలా చేయండి.
మకరందం ఇచ్చే పూల మొక్కలు:
బంతి, లాంటానా, పెటూనియా, తులసి వంటి సువాసన ఇచ్చే మొక్కలను పెంచండి. ఇవి సీతాకోకచిలుకలకు కావాల్సిన మకరందాన్ని అందిస్తాయి.
రసాయనాలు వాడకండి:
పురుగుమందులు, రసాయనాలు ఉపయోగిస్తే సీతాకోకచిలుకలు రావు. కాబట్టి కేవలం సేంద్రియ (ఆర్గానిక్) పద్ధతులనే ఉపయోగించండి.
మంచి ఎండ, గాలి పడేలా చూడండి:
సీతాకోకచిలుకలు ఎండకాచుకోవడానికి ఇష్టపడతాయి. కాబట్టి బాల్కనీలోకి తగినంత సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూసుకోండి.
చిన్న నీడ ప్రదేశాలు:
అవి విశ్రాంతి తీసుకోవడానికి మొక్కల మధ్య కాస్త నీడ ఉండేలా చూడండి. దీనివల్ల అవి మీ బాల్కనీలో ఎక్కువసేపు గడుపుతాయి.
ఇలా కొద్దిగా క్రియేటివిటీ, సరైన మొక్కలతో మీ బాల్కనీని ఒక చిన్న ప్రకృతి స్వర్గంగా మార్చుకోవచ్చు!
