Sandeep Reddy Vanga: శింబు'అరసన్'లో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ క్యామియోపై వైరల్ టాక్!

Sandeep Reddy Vanga: శింబు'అరసన్'లో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ క్యామియోపై వైరల్ టాక్!

కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో 'అరసన్'ఒకటి. స్టార్ హీరో శింబు, విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో రూపుదిద్దకుంటున్నఈ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.

నటుడిగా సందీప్ రెడ్డి వంగా..

'అరసన్'లో సందీప్ రెడ్డి వంగా ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇది నిజమా? లేక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో రూమరా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, 2018లో విడుదలైన 'మహానటి' తర్వాత సందీప్ రెడ్డి వంగా మళ్లీ తెరపై కనిపించనున్నారనే ఆసక్తికరమైన చర్చ మొదలవుతుంది.

ALSO READ : అజిత్ 'డేర్ డెవిల్'లో హీరోయిన్ మార్పు?

గతంలో రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాలో తాను భాగం కాదని సందీప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను2027 అక్టోబర్ 29న దీపావళికి విడుదల చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు మేకర్స్.

'అరసన్'పై భారీ అంచనాలు..

ఇక 'అరసన్' విషయానికి వస్తే.. శింబుతో పాటు విజయ్ సేతుపతి, ఆండ్రియా జెరెమియా, యోగా లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వాస్తవికమైన కథనం, తీవ్రమైన పాత్రల చిత్రణకు పేరుగాంచిన వెట్రిమారన్ ఈసారి ఎలాంటి ప్రపంచాన్ని చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా క్యామియో నిజమైతే 'అరసన్'కు మరో ప్రత్యేక ఆకర్షణ తోడైనట్లేని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.