అర్నాబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ ని అల్లకల్లోలం చేస్తోంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా 2026 అక్టోబర్ 28న కృష్ణా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ధాటికి చెట్లు, హోర్డింగులు పలుచోట్ల విరిగిపడ్డాయి.
అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలోని వేణుగోపాలపురం లో రోడ్డు మీద భారీ చెట్లు విరిగిపడ్డాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానకి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భయంకరమైన గాలులకు దగ్గరలోనే ఉన్న సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ప్రజలందరు భయబ్రాంతులకు గురయ్యారు.
రాత్రి నుంచీ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పూర్తిగా అంధకారంలో వేణుగోపాలపురం ఉంది. విద్యుత్ సరఫరా నిలవడంతో ఒక వైపు ఆక్వారంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోప్రక్క ఇంటర్నెట్ సేవలు కూడా నిలవదoతో 1977 తుపాన్ మాదిరి ఏమైనా విపత్తు సంభవిస్తుందా అని భయపడుతున్నారు.
మరోవైపు గ్రామం నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదంటే వాపోతున్నారు. ఉల్లిపాలెం వైపు లింగన్నకోడు దగ్గర వంతెన విరిగిపోవటం, సాలెంపాలెం వైపు రోడ్డు లేకపోవటం వలన భయంకరమైన పరిస్థితులలో ఉన్నామని వేణుగోపాలపురం ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
