ఏపీలో అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు  విమానాలు రద్దు 

ఏపీలో అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు  విమానాలు రద్దు 

ఏపీల అర్నాబ్ తుఫాన్ తీరం తాటి తుఫానుగా బలహీనపడింది. దీంతో  రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈదురు గాలుతో భారీవర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో  ఏపీ మొత్తం జనజీవనం స్థంభించింది. చాలా ప్రాంతాల్లో  రోడ్డు, కాలనీలు జలమయమయ్యాయి. భారీ వృక్షాలు కూలిపోయాయి. తుఫాన్ ధాటిని ఇప్పటివరకు ఏపీలో ఐదుగురు చనిపోయారు. తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన రైల్వే  శాఖ ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసింది. తాజాగా  పలు విమాన సర్వీసులను రద్దుచేశారు.  

విశాఖపట్నం ఎయిర్​పోర్టు నుంచి విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, తిరుపతి వంటి నగరాలకు వెళ్లాల్సిన దాదాపు 16 విమాన సర్వీసులు రద్దయ్యాయి.విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టునుంచి ఇండిగో (IndiGo) సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. అలాగే ఎయిర్ ఇండియాకు చెందిన ఢిల్లీ సర్వీస్, ఫ్లై91 కి చెందిన హైదరాబాద్ సర్వీసులు కూడా నిలిపివేశారు.రాజమండ్రి  ఎయిర్ పోర్టునుంచి అక్టోబర్ 27 రాత్రి నుంచే అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు.

తుఫాను అర్నాబ్ తీరాన్ని తాకిన క్రమంలో అప్రమత్తమైన  కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏపీనుంచి పలు విమానాలను రద్ద చేయనుంది.  హైదరాబాద్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పూర్‌లకు విమానాలు ఆలస్యం లేదా రద్దు అయ్యే అవకాశంఉందని ఏవీయేషన్ అధికారులు తెలిపారు.విమానాల రాకపోకలు, టైమింగ్స్, టికెట్ బుకింగ్ పై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని కోరారు. 

అర్నాబ్ తుఫానుతో ప్రతికూల వాతావరణంలో  కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఎయిర్ పోర్టునుంచి  పలు విమానాలను రద్దు చేయడం లేదా వాటికి అంతరాయం కలిగించడం జరిగిందని ఏఎన్ఐ తెలిపింది. 

ఆర్నబ్ తుఫాను క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు కరెంట్ షాక్ కు గురై చనిపోయారు. మచిలీపట్నంలో  బలమైన గాలులు , భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.
భారీ వర్షాలు, బలమైన గాలులు ,వరదలతో ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా  అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఆర్నబ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా, జగ్గంపేటలో జాతీయ రహదారి సర్వీస్ రోడ్లు జలమయమై, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

అర్నాబ్ తుఫాను తీరం దాటుతుకున్న క్రమంలో ఒడిశాలో 30వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశా దక్షిణ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా తుఫానుతో అత్యంత ప్రభావం అయ్యే మల్కన్‌గిరి జిల్లాలో లోతట్టు ,కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

ALSO READ : కృష్ణా జిల్లాలో తుపాను బీభత్సం.. భారీ వర్షానికి విరిగిపడ్డ చెట్లు, హోర్డింగులు

రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 16 జిల్లాల్లో స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేశారు. కొన్ని దక్షిణ జిల్లాల్లో చెట్లు కూలిపోయినట్లు సమాచారం..అయితే పెద్దగా ఆస్తినష్టంగానీ, ప్రాణం నష్టంగానీ జరగలేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.