ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో తెలుగు ఫాంటసీ థ్రిల్లర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సిద్ధమైంది. మ్యాజిక్, కామెడీ, అడ్వెంచర్‌తో పాటు ఆసక్తికరమైన ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా పిల్లలకు మంచి వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిలవనుంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ సినిమా చిన్నారులను తెగ ఎంటర్ టైన్ చేసింది. మరి ఈ మ్యాజిక్, ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఎప్పుడు.. ఎక్కడ? స్ట్రీమింగ్ అవ్వనుందనే వివరాలు చూద్దాం..
చిన్నపిల్లలకు ఓటీటీలో మంచి వీకెండ్ ఛాయిస్..
చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ మ్యాజిక్, ఫాంటసీ, కామెడీ, అడ్వెంచర్‌ను కలిపి తెరకెక్కించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సాగుతుంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే మ్యాజిక్ సీన్స్, వింతైన ఫాంటసీ ఎలిమెంట్స్ పిల్లలకు ఆసక్తిని కలిగిస్తూ.. ఏం జరగబోతుందా అనే క్యూరియాసిటీని పెంచుతాయి. మధ్య మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు చిన్నారులతో పాటు పెద్దలను కూడా నవ్వించేలా ఉన్నాయి. ఇక సూరి, దివ్య మధ్య ఏర్పడే అనుబంధం కథకు మంచి ఎమోషన్‌ను జోడిస్తుంది. ఫాంటసీ, మ్యాజిక్‌తో పిల్లలను ఎంగేజ్ చేస్తూనే.. ఎమోషన్, కామెడీతో తల్లిదండ్రులను కూడా కథలో భాగం చేసే ప్రయత్నం కనిపిస్తుంది.
ఓటీటీలోనైనా ప్రేక్షకులను మెప్పిస్తుందా?
థియేటర్లలో మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 30 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సినిమాకు డిజిటల్ వేదికపై ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో ఈ సినిమాను చూసే అవకాశం ఉండటంతో, అక్కడైనా మంచి ఆదరణ లభిస్తుందేమో చూడాలి.
📢 Official Announcement 🪄 #DontTroubleTheTrouble (Telugu) Streaming from October 30 on Netflix in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi 🍿!! #OTT_Trackers https://t.co/51ylqmTyVQ
— OTT Trackers (@OTT_Trackers) October 28, 2026
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కథేంటంటే:
సూరి (ఫహాద్ ఫాజిల్) డబ్బు కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడని వ్యక్తి. చిన్న చిన్న మోసాలు, మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ తన అవసరాలను నెట్టుకొస్తుంటాడు. అయితే ఓ సందర్భంలో స్థానిక గ్యాంగ్‌స్టర్ దగ్గర చిక్కుకోవడంతో భారీ మొత్తంలో డబ్బును చాలా తక్కువ సమయంలో సమకూర్చాల్సిన పరిస్థితి వస్తుంది.
ఆ డబ్బు కోసం సూరి చేసే ప్రయత్నాల్లోకి దివ్య (సారా పాలేకర్) అనే చిన్నారి వస్తుంది. ఆమెను ఉపయోగించుకుని తన సమస్య నుంచి బయటపడాలని మొదట భావించిన సూరి.. క్రమంగా ఆమె చుట్టూ ఉన్న ఓ అసాధారణమైన రహస్యంలో చిక్కుకుంటాడు. దివ్యకు ఉన్న వింత శక్తులు, ఆమె గతం, సూరితో ఆమె ప్రయాణం ఎటు దారి తీసింది? డబ్బు కోసం మొదలైన ఈ ప్రయాణం చివరికి సూరిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేదే మిగతా కథ.
స్టార్ హీరోల సపోర్ట్.. థియేటర్లలో మిక్సెడ్ టాక్
ఈ సినిమాకు రాజమౌళి కుటుంబంతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య వంటి స్టార్ హీరోలు సపోర్ట్ చేసినప్పటికీ మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు కానీ, సినిమా కథ, అర్ధం కానీ టైటిల్ ద్వారా జనాలను థియేటర్లోకి రప్పించడంలో ఫెయిల్ అయ్యారు.
ALSO READ : శింబు'అరసన్'లో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ క్యామియోపై వైరల్ టాక్!
సినిమాలోని ఫాంటసీ, కామెడీ అంశాలు కొంతమందిని ఆకట్టుకున్నప్పటికీ, కథనం విషయంలో ప్రేక్షకుల నుంచి మిక్సెడ్ రియాక్షన్స్ వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కనిపించిన వినోదం, ఫాంటసీ అంశాలు సెకండాఫ్‌లో అదే స్థాయిలో కొనసాగలేదనే రివ్యూలు వినిపించాయి. కథనం నెమ్మదించడం కూడా సినిమాకు మరింత నెగిటివ్ గా మారిందని కొందరు ప్రేక్షకులు భావించారు. ఈ క్రమంలోనే సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఎంటర్‌టైన్ చేయలేకపోయింది.
