వెలుగు స్పెషల్ : నీళ్ల నిజాలు..  బీఆర్ఎస్ అబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ధాలు

వెలుగు స్పెషల్ : నీళ్ల నిజాలు..  బీఆర్ఎస్ అబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ధాలు

నీరు ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లమెరుగు,  నిజం దేవుడెరుగు అంటారు.  నీళ్లు ఎగువ నుంచి  దిగువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  ప్రవహిస్తాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే వాస్తవం ప్రతి ఒక్కరికీ తెలుసు.  అయితే  నీళ్లు పల్లం నుంచి ఎత్తుకు వెళతాయని నమ్మించేవాళ్లు  బీఆర్ఎస్ నాయకులు. రాజమండ్రి తర్వాత  గోదావరి నది  తెలంగాణలోకి వస్తుందని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక యువ నాయకుడు ఒక ఇంటర్వ్యూలో బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లగుద్ది మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీ చెప్పాడు.  శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న పార్టీ ఆశాదీప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ టిక్కెట్ ఇచ్చారు. ఇంత మేధావి  లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటే  క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ష్టమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని గ్రహించిన  ప్రజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూడో స్థానంలో నిలిపారు.  బీఆర్ఎస్ న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్లే.. ప్రజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ను న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మితే ఢిల్లీ వేదిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న చెప్పే అబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ధాలు, అవాస్తవాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం.. అబ్బో ఆ దారుణం ఊహించలేం.  ఆ యువ నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కునికి ఏమాత్రం తీసిపోకుండా నిత్యం బీఆర్ఎస్ నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కులు అబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ధాలే ప్రచారం చేస్తుంటారు. 

త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మపై క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  తెలంగాణ ప్రభుత్వం గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి నీళ్లను  ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిలేస్తోందంటూ  హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీశ్​రావు, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కులు కొద్ది రోజులుగా చేస్తున్న విష ప్రచారం అలాంటిదే. అస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిలో  ఇప్పుడున్న ప్రవాహం ఎంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాటి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లే నీళ్లు ఎన్ని అనే వివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాలను మాత్రం వాళ్లు మాటవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రుస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా ప్రస్తావించ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ నుంచి గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిలో ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళుతున్న నీళ్లు లేనేలేవు. అదే అస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిజం. 

నిజామాబాద్ జిల్లా కంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుర్తి వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ద మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హారాష్ట్ర నుంచి తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది ప్రవేశిస్తోంది. ఆ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వాత శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాం సాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ ప్రాజెక్టు ఉంది. 90 టీఎంసీల నీటి నిల్వ సామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్థ్యం ఉన్న శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాంసాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాశ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యం ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ఈ ఏడాది నిండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేలేదు. శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాం సాగర్ ఎగువన మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హారాష్ట్రలో గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిపై జైక్వాడీ (102.7 టీఎంసీ), బాబ్లీ (77.5 టీఎంసీ) వంటి పెద్ద ప్రాజెక్టుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు విష్ణుపురి (2.85 టీఎంసీ), గంగాపూర్ (7.2 టీఎంసీ) ఆన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టలున్నాయి. వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్షాలు లేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డంతో శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాంసాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇప్పుడు చుక్క నీటి ప్రవాహం లేదు. 

శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాం సాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ నుంచి శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాద ఎల్లంప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి ప్రాజెక్టు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి ఎడారినే త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పిస్తోంది.  శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాద ఎల్లంప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి దిగువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న కేసీఆర్ హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాంలో నిర్మించిన సుందిళ్ల, అన్నారం,  మేడిగడ్డ  బ్యారేజీలున్నాయి. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న ప్రాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిత న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిలో క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిసిన త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వాత మేడిగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డ బ్యారేజీ నిర్మించారు. ప్రాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిత నుంచి కొద్దిపాటి వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద ఇప్పుడు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తోంది.  ప్రాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిత నుంచి వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చే కొద్దిపాటి నీరును ఎత్తిపోసే అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాశం లేదు. నీటిని నేరుగా ఎత్తిపోసే అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాశం ఉంటే బ్యారేజీలు నిర్మించాల్సిన అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మే లేదు. 

 క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ల  క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్కుర్తి వల్ల కుంగిన మేడిగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డ బ్యారేజీ

మోటార్లు నీరు ఎత్తిపోయాలంటే బ్యారేజీల వెనుక నిర్దేశిత స్థాయి నీరు నిల్వ ఉండాలి.  బీఆర్ఎస్  నేత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల  క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ల  క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్కుర్తితో నిర్మించిన మేడిగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డ బ్యారేజీ కుంగిపోయింది. అక్కడ నీరు నిలిపితే బ్యారేజీ మొత్తం కొట్టుకుపోతుంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్ఏ) అధికారులు  తేల్చిచెప్పారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్ఏ అధికారులను కాద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని బీఆర్ఎస్ నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుల మాటవిని మేడిగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ద నీరు నిలిపితే ఆ బ్యారేజీ పూర్తిగా కొట్టుకుపోయి ములుగు, భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్రాచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం నియోజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్గాల్లోని  ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దుల గ్రామాలు మునిగిపోతాయి.  బ్యారేజీ  కొట్టుకుపోయినా, గ్రామాలు జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాధి అయినా ఫర్వాలేదు, కానీ నీళ్లు నిలపమని,  బీఆర్ఎస్ నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కులు అంటున్నారు.  

బీఆర్ఎస్ నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కులు, ఆ పార్టీ అక్రమ సంపాద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డుస్తున్న వంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాది యూట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులు నిత్యం మేడిగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్దకు కెమెరాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వెళుతూ గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి నీళ్లన్నింటిని ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిలేస్తున్నారంటూ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చి అబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ధాలు చెబుతున్నారు. మేడిగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డ దిగువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే ఆంధ్రప్రదేశ్ ఉన్నదన్నట్లు విష ప్రచారం చేస్తున్నారు.  కానీ మేడిగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డ దిగువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న  సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు వద్దనే  చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్ నుంచి వచ్చే ఇంద్రావతి నది గోదావరిలో కలుస్తుంది.  ప్రాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంద్రావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తి న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దుల నుంచి వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తున్న నీరు ఈ బ్యారేజీతో కొంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేర న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిలో నిల్వ ఉండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డంతో  దేవాదుల ఎత్తిపోత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం పంపులు న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డిపేందుకు వీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుతుంది.  ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నిత్యం దేవాదుల నుంచి 8 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తోంది.  

తెలంగాణ నుంచి గోదావరిలో ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళుతున్న నీళ్లే లేవు

మొత్తంగా చూస్తే ఇప్పుడు తెలంగాణ నుంచి గోదావరిలో ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళుతున్న నీళ్లే లేవు.  మరి అలాంటప్పుడు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో,  తెలంగాణ ప్రభుత్వమో ఆ రాష్ట్రానికి నీళ్లు ఎలా వదులుతారు. ప్రజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అమాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, అజ్ఞానులని, తామేం చెప్పినా గుడ్డిగా న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్ముతార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే విశ్వాసం బీఆర్ఎస్ నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుల న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రానా ఉంది. అందుకే  నిస్సిగ్గుగా నిత్యం అబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ధాలతో  ప్రచారం హోరెత్తిస్తున్నారు. అదే స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరు ఎత్తిపోయడం అవాస్తవమా అంటే అదేం కాదు.  మరి వాళ్లకు నీళ్లు  ఎక్కడివి అంటే...  భద్రాచలం  దిగువన గోదావరి నదిలో శబరి నది కలుస్తుంది.  ఒడిశా నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్, ఒడిశా,  చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కూడలిలో గోదావరిలో  కలిసే  శబరిని స్థానికులు చిన్న గోదావరి అని పిలుచుకుంటారు. 

ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లోని  ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టమైన కొండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ ప్రాంతంలో ప్రవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హించే సీలేరు శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిలో క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుస్తుంది. ఒడిశా,  చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోని అటవీ ప్రాంతాల నుంచి అనేక వాగులు  సీలేరు, శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దుల్లో క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుస్తుంటాయి.  ఫ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లితంగా మండు వేస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌విలోనూ శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిలో ప్రవాహం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్  భూభాగంలో  భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్రాచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం దిగువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  రాజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మండ్రికి ఎగువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిలో ఉన్న జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నీ శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాలే.. ఈ నీళ్లనే ఆంధ్రప్రదేశ్ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టిసీమ ఎత్తిపోత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఎత్తిపోసుకుంటుంది.  అసలు వాస్తవం ఇది.

బీఆర్ఎస్ నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కులు మాత్రం గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి నీళ్లను  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దులుతున్నార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే అవాస్తవాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేని గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి నీళ్లను ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వదులుతున్నార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే అస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్య  ప్రచారాన్ని ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కులు మానుకోవాలి.  లేకుంటే త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ యువనేత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  పంపి  ఆంధ్రప్రదేశ్ నుంచి శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిందులుగా చూపిస్తూ  శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాం సాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళ్లించే ప్రయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్నం చేయాలి. అలా మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళ్లించే సామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్థ్యం వాళ్లకు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికానీ,  మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రే నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుడు కానీ వారిని అడ్డుకోరు.  బీఆర్ఎస్ నేత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లంతా వెంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే పలుగు, పార పట్టుకొని శబరి నది నుంచి నీటిని శ్రీరాం సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మళ్లించే  ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుల్లోకి  దిగాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విజ్ఞప్తి చేస్తున్నా.

తెలంగాణలో గోదావరికి చివరి మజిలీ భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్రాచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం

స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మక్క బ్యారేజీ దిగువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న దుమ్ముగూడెం వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ద గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిపై ఆన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్ట ఉంది. 150 ఏళ్ల క్రితం స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ ఆర్దర్  కాట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించిన ఆ ఆన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టతో గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిలో 0.8 టీఎంసీల నీరు నిల్వ చేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చు.. ఇక్కడి నుంచి నీరు కింద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లకుండా ఆన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టపై 5 ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షల ఇసుక బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తాలను రాష్ట్ర  ప్రభుత్వం వేయిస్తోంది.  దీంతో అద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నంగా మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రో టీఎంసీ నీటిని నదీ గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్భంలోనే నిల్వ చేసే అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాశం ఉంది. దుమ్ముగూడెం ఆన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్ట ఎగువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిలో నిలిచిన నీరును సీతారామ ఎత్తిపోత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం ద్వారా ఎత్తిపోసి ఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మం, భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బూబాబాద్ జిల్లాల్లోని చెరువులు, కుంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్నిస్తోంది.  దుమ్ముగూడెం ఆన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్ట త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వాత తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిపై ఎటువంటి ఆన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టలు లేవు. 

దుమ్ముగూడెం ఆన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్ట నుంచి తెలంగాణ రాష్ట్రంలో గోదావరికి చివరి మజిలీ అయిన భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్రాచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం 25 కి.మీ. ఉంటుంది. ఈ మధ్యలో గోదావరిలో కలిసే ముఖ్యమైన నదులు, వాగులు ఏం లేవు.. భద్రాచలం దాటిన తర్వాత కిన్నెరసాని నది గోదావరిలో కలుస్తోంది.  కిన్నెరసానిపై యానంబైలు వద్ద కిన్నెరసాని ప్రాజెక్టు (8.40 టీఎంసీలు) ఉంది. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలకు తాగునీటికి కిన్నెరసాని జలాలను వినియోగిస్తారు. కేవలం ఒక టీఎంసీ నీటిని మాత్రమే సాగునీటికి వినియోగిస్తారు. ఈ డ్యామ్ తర్వాత కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే కిన్నెరసాని ప్రవాహం ఉంటుంది.  వర్షాకాలంలో మినహా అక్కడ నీటి ప్రవాహం ఉండదు. స్థూలంగా ఇది తెలంగాణలో గోదావరి ప్రవాహం తీరు. 

- చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ, భువనగిరి

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 

[email protected] 

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 

స్వీయ రచన అయి ఉండాలి.

రచన 700 పదాలకు మించరాదు.