హైదరాబాద్, వెలుగు: ఎల్నినోతోఉన్న కరువును ఎదుర్కోవడానికి కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. నీళ్లు లిఫ్ట్ చేయడానికి తగినంత ఎత్తు లేకుంటే కనీసం కాఫర్డ్యామ్అయినా నిర్మించి లిఫ్ట్ చేయాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు దగ్గర ఇసుక బస్తాలు వేసుకొని నీటిని నింపుతామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారని, మేడిగడ్డ వద్ద కూడా అలాగే చేయాలని తెలిపారు. ఒక్క నెలలో కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని లిఫ్ట్ చేయొచ్చని చెప్పారు.
ఈ మేరకు మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రోజుకు ఒక టీఎంసీ ఎత్తిపోసినా ఐదు నెలల్లో 150 టీఎంసీలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. నీళ్లు, కరెంట్ అడగవద్దంటూ వరి విత్తనాలు కొనే రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. వృథాగా పోతున్న ప్రాణహిత జలాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉందని, తాగు, సాగు నీటితో పాటు విద్యుత్‌కు కూడా ఉపయోగపడుతుందని వివరించారు. 30 నెలలు నిద్రపోయిన రేవంత్ ఇప్పుడు మహారాష్ట్ర వెళ్లి తుమ్మిడిహెట్టి గురించి మాట్లాడారని వెల్లడించారు. మహారాష్ట్ర వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఏం సాధించారని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు.
