నితిన్ హీరోగా ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. హీరో నాని సమర్పణలో యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్‌కు జంటగా ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా నటిస్తోంది. మంగళవారం ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన పాటను అనురాగ్ కులకర్ణి పాడిన విధానం ఆకట్టుకుంది. ‘రుక్కు రుక్కు రుక్మిణీ ఒప్పేసుకో మా రాణి.. కిట్టు కిట్టు కిట్టయ్యకి నువ్వే అలివేణి.. ’ అంటూ పూర్ణాచారి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.
కోర్టులో పనిచేసే కృష్ణ(నితిన్), స్కూల్ టీచర్‌గా చేసే రుక్మిణి (ఆఫియా సయ్యద్)పై ప్రేమ కలుగుతుంది. ఆమె రాకతో తన జీవితానికి కొత్త అర్థం వస్తుందని భావించిన కృష్ణ, మనసుకు హత్తుకునే పాటతో తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టుగా ఈ పాటను చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా విడుదలైన సాంగ్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. డిసెంబర్ 4న సినిమా విడుదల కానుంది.
